వెబ్ మీడియా విపరీతంగా పాపులర్ అయిపోవడంతో ఈ మీడియాను ఆధారంగా చేసుకుని నెటిజన్లు కూడ తమ విలక్షణమైన క్రియేటివిటీని రకరకాలుగా చూపెడుతూ సినిమా సెలెబ్రెటీలకు కూడా ఖంగారు పెట్టిస్తున్నారు. ఇటువంటి సందర్భమే దర్శకుడు హరీష్ శంకర్ కు లేటెస్ట్ గా ఎదురైంది. గత కొద్దిరోజులుగా సాయి ధరమ్ తేజ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలోని సాయి ధరమ్ తేజ్ లుక్ ఇలా ఉంటుంది అని చెపుతూ ఒక ఫోటో విపరీతంగా హడావిడి చేస్తోంది.

ఈ ఫోటోను చూసిన మెగా అభిమానులు ఆశ్చర్యపోయి సాయి ధరమ్ తేజ్ ను ఇలా ఒక సైకీ లుక్ తో ఎందుకు చూపెడుతున్నారు అంటూ హరీష్ పై మెసేజ్ ల దాడి ప్రారంభించారట మెగా ఫ్యాన్స్. ఈ దాడికి అదిరి పోయిన హరీష్ శంకర్ అసలు విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్య పోయి వివరణ ఇచ్చాడు.

వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈఫోటో తాను తీస్తున్న సినిమాలోని సాయి ధరమ్ తేజ్ లుక్ కాదని ఒక ప్రముఖ పత్రిక కోసం సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన ఫోటో షూట్ లోని ఫోటోలలో ఇది ఒకటి అని వివరణ ఇచ్చాడు. ఇప్పటికే తాను దర్శకత్వం వహించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా నెగిటివ్ పబ్లిసిటీతో దెబ్బ తినడంతో హరీష్ శంకర్ కు ఇప్పుడు వెబ్ మీడియా కామెంట్లు అంటేనే అదిరిపోతున్నాడు.

ఈ నేపధ్యంలో వెబ్ మీడియాలో జరుగుతున్న హడవిడిని గమనించిన హరీష్ శంకర్ ఈ రూమర్లకు అడ్డు కట్ట వేస్తూ వ్యూహాత్మకంగా వెంటనే స్పందించాడు అనుకోవాలి. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ విజయవంతం కావడం హీరోగా సాయి ధరమ్ తేజ్ కెరియర్ కు ఎంత ముఖ్యమో దర్శకుడిగా హరీష్ శంకర్ కు మరింత కీలకంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: