పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహాంచే సినిమా ఏ రేంజ్ లో ఉంటాయో వేరేగా చెప్పాల. ఈ మధ్యనే టెంపర్ సినిమాతో తనలో టెంపర్ ఎంత ఉందో నిరూపించాడు. చాలా రిచ్ గా ఫ్యాషనబుల్ గా ఈ కాలంలో యువతకు ఎలాంటి అభిరుచి కలిగి ఉన్నారో వారి తగిన విధంగా డైరెక్ట్ చేసి మెప్పించగల దిట్ పూరీ.

తాజాగా పూరీ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయబోతున్నాడు అదే నండి మన పంజాబీ ముద్దుగుమ్మ చార్మి హీరోయిన్ గా ‘జ్యోతి లక్ష్మి’. పేరు వింటేనే ఆ కాలం లో తెలుగు సినీ జగత్తును ఒక్క మత్తులో ముంచేసిన తార జ్యోతిలక్ష్మి గుర్తుకు వస్తుంది కదా కానీ ఆమె జీవితానికి సంబంధించిన కథ మాత్రం కాదట.

ఈ మధ్య హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యలు వారి నిజ జీవితాల్లో జరుగుతున్న సంఘటన ప్రతిరూపమే ఈ జ్యోతిలక్ష్మి అని అంటున్నారు. కాగా సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈ చిత్రంలో ఓ హీరోయిన్ విషయం లో ఇటీవల జరిగిన సంఘటనలు కూడా ఉంటాయని అంటున్నారు .

టైటిల్ కు ,ఆ పాత్రకు తగ్గట్లుగా ఛార్మి ని ఎన్నుకొని అందుకు తగ్గట్లే చాలానే హాట్ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయని తెలుస్తోంది . చిత్ర పరిశ్రమ విచిత్ర పరిశ్రమ అన్న విషయం తెలిసిందే దాంతో అనూహ్య సంఘటనలు ఈ చిత్రంలో ఉన్నాయని తెలుస్తోంది . అయితే మరి మన పూరీగారు యాపిల్ పండులా ఉండే ముద్దుగుమ్మ ఏ రేంజ్ లో చూపిస్తాడో వేయిల్ చేయాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: