ఒకప్పుడు మళయాలంలో సెక్స్ బాంబుగా పేరు తెచ్చుకొని పెద్ద హీరోలకే చెమటలు పట్టేలా చేసిన లావు సుందరి షకీలా ఆలాంటి సినిమాలకు స్వస్తి చెప్పి చిన్న చిన్న క్యారెక్టర్ పాత్రలు చేయడం మొదలు పెట్టింది. తెలుగు, తమిళ, మళిమాల, కన్న భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూంది. అయితే ఈ మధ్య ఈ భామ డైరెక్టర్ అవతారమెత్తింది ‘రొమాంటిక్ టార్గెట్’ అనే సినిమా తీస్తోంది.

కాకపోతే టైటిల్ కు తగ్గట్టు గానే రొమాంటిక్ సీన్లు ఉన్నా ఇందులో ఆడవారికి జరిగే అన్యాయలను ఎక్కువ ఫోకస్ చేస్తుందట. ఆడవారికి మాయ మాటలు చెప్పి వారి జీవితాలతో ఆడుకునే బడా బాబుల గురించి ఈ సినిమాలో చూపిస్తుందట. అంతే కావు అలా మోసపోయిన అమ్మాయి ఏ విధంగా వారిపై ప్రతీకారం తీసుకుంటుందో సభ్య సమాజాన్ని ఏ విధంగా జాగృతం చేస్తుందో అనే విషయాలు ఈ సినిమాలో ఉన్నాయట.

అత్యాచారాలకు గురైతున్న అమ్మాయిలు మగవారిని ఎలా ఎదుర్కొంటారో అనే విషయం పై సినిమాలో బాగానే చూపించిందట. ఇదంతా బాగానే ఉంది మరి షకీలాను ఎవరు బెదిరిస్తున్నారు అన్నవిషయానికి వస్తే.. షకీలా జీవితంలో ఎన్నో ఆటు పోట్ల కు గురైందని ఆమె నిజజీవింతో ఎదుర్కొన్న సంఘటనలు ఈ సినిమాలో చూపించబోతుందని తెలిసింది..? ఒకవేళ షకీలా ఎవరినైనా టార్గెట్ చేస్తుందా ఏమిటనే అనుమానం రేకెత్తింది..?

దీంతో ఖంగారు పడ్డ బడా బాబులు ఈ సినిమాను ఆపేయాలని షకీలాను బెదిరిస్తున్నట్లుగా తెలిసింది. అంతే కాదు ఇందులో పొలిటీషియన్లు కూడా ఉన్నారనే అనుమానాలు తావుస్తుంది. మరి షకీలా ఈ బెదిరింపులకు భయపడి సినిమా ఆపుతుందా? లేక విడుదల చేస్తుందా? వేచి చూడాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి: