కొంతకాలం క్రితం తెలుగు చలన చిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన కథానాయక రమ్యకృష్ణ. ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన ఈమె నటించింది. 1990ల్లో కుర్రకారును ఉర్రూతలూగించిన అందాల రాశి రమ్యకృష్ణ. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు అంటూ సినిమాలకు కొంత గ్యాపి ఇచ్చింది. మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ అయిన అమ్మడు సక్సెస్‌ఫుగా దూసుకుపోతుంది.

అయితే రీఎంట్రీ తొలి రోజుల్లో రమ్యకు తెలుగులో అవకాశాలు బాగానా వచ్చినా, ఆ తర్వాత తగ్గాయి. తాజాగా రమ్యక్రిష్ణ బాహుబలి చిత్రంలో నటిస్తుంది. నిజానికి రమ్యక్రిష్ణ తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.

ప్రస్తుతం రమ్యక్రిష్ణ ఆరు సినిమాలు చేస్తుండగా, అన్నీ అమ్మ పాత్రలే కాడవం విశేషం. అందాల భామ రమ్యకృష్ణ 90వ దశకంలో యువతను కట్టిపడేసింది. అయితే కృష్ణవంశీ తో వివాహం జరిగిన తరువాత ఎంపిక చేసుకున్న చిత్రాలలో మాత్రమే నటిస్తూ వస్తుంది.

అయితే వీటిలో చాలా వరకూ తమిళ సినిమాలే వుండడం గమనార్హం. అలాగే మళయాళంలో రమ్యక్రిష్ణ తనదైన శైలిలో దూసుకుపోతుంది.అప్పావుమ్ వీంజుం అనే సినిమాలోనూ రమ్యక్రిష్ణ నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: