---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

అబ్బ హాట్...... బ్యూటీ సన్నీ లియోన్. అందాల ఆరబోతలో తనకు తానే సాటి. ఇప్పుడు ఈ గుమ్మ నిన్నటితరం శృంగారతార జీనత్ అమన్‌లా శృంగారాన్ని పండిస్తోంది. గతంలో వచ్చిన 'సత్యం శివం సుందరం' చిత్రంలో ఓ పాటలో జీనత్ అమన్ తెల్లచీర ధరించి తన అందాలను వెదజల్లింది.

సన్నీ కూడా 'ఏక్ పహేలి లీల' సినిమాలో అచ్చం అలాగే తెల్లచీరలో అందాలు ఒలకబోసింది. దీని గురించి ఈ చిత్ర దర్శకుడు బాబీఖాన్ చెబుతూ, "ఆ సినిమాలో జీనత్ అందమే అందం. అదే ఐడియాతో చేద్దామనగానే సన్నీ వెంటనే ఓకే చెప్పింది. అయితే, జీనత్ లా టాప్ లెస్ లో కాకుండా సన్నీ కాస్తంత డీసెంట్ గా కనిపిస్తుంది" అని చెప్పాడు. ఏమైనా, తెల్లచీరలో సన్నీ హొయలు కుర్రకారు నరనరాలను జువ్వున లాగేస్తున్నాయి.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: