బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ హాట్ టాపిక్ గా వినిపిస్తున్నాడు. ఎందుకంటే, సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బాజీరావు మస్తానీ’ చిత్రంలో పాత్ర కోసం రణవీర్‌సింగ్ ప్రత్యేకకంగా గుండు చేయించుకున్నాడు. పూర్తిగా ఒక సంవత్సర సమయం ఈ చిత్రం కోసమే కేటాయించనున్నట్లు రణవీర్ స్వయంగా చెప్పాడు.

అంతే కాకుండా తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ తాజాగా తను గాయాల పాలవ్వటం అనేది ఇండస్ట్రీ టాక్ గా మారింది. వివరాల్లోకి వెళితే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించబోయే ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంపై బాలీవుడ్లో ఈ మధ్య చర్చ ఎక్కువగానే జరుగుతోంది. 1720లో నాలుగవ మరాఠా చత్రపతి షాహుకు ప్రధానిగా సేవలందించిన బాజీరావు పీష్వా,

ఆయన ప్రేయసి మస్తానీ జీవిత, ప్రేమకథా నేపథ్యంగా ఈ చిత్రాన్ని భన్సాలీ రూపొందించేందుకు గత 15 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. రణవీర్ కూడా ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం రణవీర్ గుండుతో నటించడానికి ఒప్పుకోవటమే కాకుండా, యాక్సన్ సన్నివేశాలలోనూ డూప్ లేకుండా నటించటానికి ఒప్పుకున్నాడట. దీంతో తాజాగా ‘బాజీరావు మస్తానీ’ షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది.

జైపూర్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతుండగా గుర్రం మీద నుంచి రణ్‌వీర్ సింగ్ కిందపడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ, ఆయనకు ఎముకలు విరగడం లాంటివేమీ జరగలేదు. షూటింగ్‌లలో గాయపడడం రణ్‌వీర్‌కు కొత్త ఏమీ కాదు. గతంలో కూడా ‘లూటేరా’ షూటింగ్ సమయంలో రణ్‌వీర్‌కు వీపు భాగంలో తీవ్రమైన గాయమైంది. అలాగే, ‘గుండే’ షూటింగ్‌లో ఆయన చేతికీ, చెంపకూ గాయాలయ్యాయి. దీంతో రణ్ వీర్ స్టంట్స్ చేయడం తగ్గించుకోవడం మంచిదని సినీ పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: