ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గ్లామర్ కి భారీ డిమాండ్ క్రియేట్ అవుతుంది. స్టార్ డం ఉన్న హీరోయిన్స్ కి అయితే ప్రముఖ సంస్థలు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ని ఇచ్చి, వారి ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేర్చుకుంటున్నారు. ఆ విధంగానే తాజాగా శృతిహాసన్ ఓ ప్రముఖ మ్యాగజైన్ కి ఓ స్టిల్ ని ఇచ్చింది.

అలా ఇచ్చినందుకు శృతిహాసన్ కి ఆ మ్యాగజైన్ ఇచ్చిన రెమ్యునరేషన్ అక్షరాల కోటి రూపాయలు. వివరాల్లోకి వెళితే, ప్రముఖ మ్యాగజైన జ్యూస్ కి శృతిహాసన్ ఫోజులు ఇచ్చింది. దానికి సంబంధించని ఎడిషన్ బయటకు వచ్చింది. ఇందులో శృతిహాసన్ సింపుల్ గా కనిపించినప్పటికీ, తన రెమ్యునరేషన్ మాత్రం హాట్ గా ఉంది.

సమ్మర్ ఎడిషన్ స్పెషల్ గా రిలీజ్ అయిన జ్యూస్ మ్యాగజైన్ కి, శృతిహాసన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతుంది. సమ్మర్ ముగిసే వరకూ శృతిహాసన్ కి సంబంధించిన హాట్ లుక్స్ ని ఇందులో పబ్లిష్ చేయటం జరుగుతుంది. అంతే కాకుండా శృతిహానన్ కి సంబంధించిన ఓ హాట్ ఫోటోషూట్ ని సైతం జ్యూస్ మ్యాగజైన్ కండక్ట్ చేసిందనే క్లియర్ న్యూస్ బయటకు వచ్చింది.

మొత్తంగా మూడు నెలల మ్యాగజైన్ క్యాంపెయిన్ కోసం శృతిహాసన్ తీసుకున్న రెమ్యునరేషన్ వెరీ హాట్ గా ఉందని అంటున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ ఆరు చిత్రాలలో నటిస్తుంది. అందులో నాలుగు చిత్రాలు బిటౌన్ మూవీలు కాగా, ఒకటి తెలుగు, తమిళ్ చిత్రాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: