సన్నీలియోన్ బాలీవుడ్లో పెద్ద స్టార్ ఈ అమ్మడు బాలీవుడ్ లో కాలు పెట్టిన దగ్గర నుంచి అన్నీ కలిసి వస్తున్నాయి. అగ్రతారలకే సవాల్ విసిరే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీకి రాకముందు సన్నీలియోన్ చూడాలంటే ‘A’ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే.. అదే నండీ బ్లూ ఫలిమ్ (ఫోర్న్) చిత్రాల సుందరీ. అయితే సన్నీలీయోన్ పై ఆమధ్య కొన్ని సంచలన వార్తలు కూడా వచ్చాయి. ఆమె టీనేజ్ గా ఉన్నపుడే అన్ని అనుభవాలు చవి చూసిందట. అసలు ఏ పరిస్థితుల్లో తాను పోర్న్‌స్టార్‌గా మారింది..

బాలీవుడ్‌లో ఎలా అడుగుపెట్టింది అనే విషయాలతో ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందట సన్నీ లియోన్. సన్నీ రియల్‌ లైఫ్‌లోని సంఘటనలను సినిమాగా మలిచేందుకు దర్శకుడు దిలీప్ మెహతా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది..? సన్నీలియోన్ భారతీయ సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ నీలి చిత్రాల నటి. జిస్మ్ 2 అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. సన్నీలియోన్ తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్తుడైనా ఆయన ఢిల్లీలో పెరిగాడు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. 1981 మే 13 న జన్మించిన ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. ఈమె పుట్టక ముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు. సన్నీలియోన్ చిన్నతనంలో పాటలు పాడటం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్, కుక్క పిల్లలని ఇష్ట పడేది.

చిన్నతనం నుండి సన్నీలియోన్ స్వేచ్ఛగానే పెరిగింది. పదకొండు ఏళ్ల వయసులో తన బాయ్ ఫ్రెండ్ తొలి ముద్దును రుచిచూసింది. యుక్తవయసుకు వచ్చిన సన్నీలియోన్ మోడల్ గా ఎదగాలనుకుంది. 1999 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది. ఈ దశలో వివస్త్రణ అవుతూ నాట్యం చేసే మరో యువతి పరిచయమైంది. తన ద్వార్ జాన్ స్టెవెన్స్ అనే ఏజెంట్ పరిచయమయ్యాడు. అడల్ట్ చిత్రాల్లోకి రాక ముందు సన్నీ లియోన్ జర్మన్ బేకరీలో కూడా పని చేసింది.

సన్నీ లియోన్ మొదట్లో లెస్బియన్ అడల్ట్ చిత్రాల్లో మాత్రమే నటించేది. ఆమె పురుషుడితో కలిసి చేసిన తొలి అడల్ట్ చిత్రం మాట్ ఎరిక్సన్ అనే వ్యక్తితో. ఇద్దరూ కలిసి కొంతకాలం డేటింగ్ చేయడంతో పాటు పలు అడల్ట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సన్నిలీయో ఫోర్న్ చిత్రాలు చేయడం మానేసి పూర్తిగా మానేసింది. తను బాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి సారించింది. సన్నీ లియోన్ గత జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆమె 42 శృంగార చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు, 41 సెక్స్ చిత్రాల్లో నటించింది. అలాంటి బూతు చరిత్ర కలిగిన సన్నీలియోన్ జీవిత చరిత్రను తెరెక్కిస్తే అందులో పూర్తిగా అడల్ట్ కాంటెంట్ ఉంటే సన్నీ అభిమానులకు సందడే మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: