నందమూరి సింహం బాలకృష్ణకు సెంటిమెంట్ హీరోయిన్ గా మారిన రాధిక ఆప్టే నగ్నత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ అంతర్జాతీయ ఇంగ్లీష్ మ్యాగజైన్ ‘హఫ్ఫింగ్ టన్’ కు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో ఈమె ఈ వ్యాఖ్యలు చేసింది. పుట్టుకతో మనం బట్టలు ధరించి పుట్టామా? అని ప్రశ్నిస్తూ దేవుడు మనలను నగ్నంగా పుట్టించినప్పుడు లేని సమస్య అమ్మాయిలు బట్టలు లేకుండా కనిపిస్తే ఎందుకు అంత రచ్చ అంటూ ఎదురు ప్రశ్నలు వేసింది ఈ లక్కీ హీరోయిన్.

జనంలో అక్షరాస్యత పెరిగింది కాని అజ్ఞానం రోజురోజుకూ పెరిగి పోతోంది అని అంటూ సినిమాలోని సన్నివేశం కోసం చిట్టిపొట్టి బట్టలతో కనిపిస్తే హీరోయిన్స్ ను ఎందుకు అంత టార్గెట్ చేస్తారు అని ఆమె సందేహాన్ని వ్యక్త పరుస్తోంది. భారతీయ సినిమాకు న్యూడిటీ అన్న విషయం కొత్త కాదని భారత దేశంలోని కులం మతం వ్యవస్థల గురించి మాట్లాడని వ్యక్తులు కేవలం అమ్మాయిలు కాస్త హాట్ గా కనిపిస్తే అది దేశ సమస్య అన్నట్లుగా మాట్లాడుతున్నారని కామెంట్ చేసింది.

కల్చర్ పేరుతో ప్రపంచ సినిమాల స్థాయికి చేరుకోవలసిన మన సినిమా రంగం ఈ చ్చాందస భావాల వల్ల ఎదగ లేకపోతోంది అని అభిప్రాయ పడింది. కనిపించని ఆత్మ పరమాత్మల గురించి గంటల కొద్ది మాట్లాడుకునే మనుషులు స్త్రీ స్వేచ్చ గురించి ఒక్క నిముషం మాట్లాడినా అసహనంగా మారిపోతారని కామెంట్ చేసింది రాధిక.

ఈమె మాటలు ఇలా ఉన్నాయి కాబట్టే ఈమధ్య కాలంలో హీరోయిన్స్ బాత్ రూమ్ వీడియోలు అంటూ కొన్ని మార్ఫింగ్ ఫోటోలతో వీడియోలు వెబ్ మీడియాలో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి. మరి హీరోయిన్స్ ను నగ్నంగా చూపెడుతూ వీడియోలు పెడితే తప్పు ఏమిటి అని అలాంటి వీడియోలు పెట్టిన వాళ్ళు ప్రశ్నిస్తే రాధిక సమాధానం ఏమిటో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: