అవును ఈ రోజు మంచు వారింట సందడే సందడి.. కోరుకున్న అమ్మాయితో పెద్దల దీవెనలతో మంచు మనోజ్ నిశ్చితార్థ మహోత్సవం బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరగనుంది. మనోడు సినిమాల్లో నే కాదు నిజ జీవితంలో కోరుకున్న అమ్మాయిని తన అర్ధాంగిగా చేసుకోబోతున్నాడన్న మాట. మనోజ్ తన వదిన ఫ్రెండ్ స్నేహితురాలు ప్రణతితో గత కొంత కాలంగా ప్రేమాయణం నడిపించాడు.

అయితే ఈ ప్రేమకు ఎవరూ అడ్డు చెప్పకుండా సున్నితంగా అందరినీ ఒప్పించాడు.ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న జాబితాలోకి మంచు విష్ణు కూడా వస్తాడు అంతేనా అల్లూ అర్జున్, రామ్ చరణ్ లాంటి కుర్రహీరోలో తాము ప్రేమించిన అమ్మాయిలతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

ఇక ఈ రోజు జరిగే నిశ్చితార్థ వేడుకకు రాజకీయ దిగ్గజాలు, సినీరంగ ప్రముఖులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, విద్యారంగానికి సంబంధించిన ప్రముఖులు వస్తున్నారని మోహన్ బాబు తెలిపారు. అంతే కాదు మోహన్ బాబు ప్రత్యేకం తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిసి తన కొడుకు నిశ్చితార్థానికి రావాల్సిందిగా కోరడం అందరికీ తెలిసిన విషయమే.

అంతే కాదండోయ్ ఈ నిశ్చితార్థానికి మరో ఎట్రాక్షన్ మెగా సోదరులు చిరంజీవి, పవన్, నాగబాబుక కూడా విచ్చేస్తున్నట్టు సమాచారం? మొత్తానికి రాక్ స్టార్ మనోజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: