టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగి ఆ తర్వాత సరైన అవకాశాలు దొరక ఐటమ్ సాంగ్ కు రెడీ అయిన ముద్దుల భామ చార్మీ. పంజాబి నుంచి వచ్చిన ఈ చిన్నది మొదట్లో చాలా క్యూట్ సెక్సీ అందరి చూపు ఇట్టే తన వైపుకు తిప్పుకుంది. వినిత్ హీరోగా కృష్ణ వంశి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం శ్రీ ఆంజనేయం లో అమ్మడు అందాలు విరివిగా ఆరబోసింది.

అప్పటి నుంచి గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త తారకు కొదవ లేదుగా కాంపిటీషన్ బాగా పెరిగి పోవడంతో ఐటమ్ సాంగ్స్ కి ఫిక్స్ అయ్యింది. అడపా దడపా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసినా అవికూడా బంపర్ ఫ్లాప్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

చార్మీ ఇప్పటికే ‘నాయక్‌, ఢమరుకం, రగడ’ వంటి చిత్రాల్లో ఐటంసాంగ్స్‌ చేసిన ఆమె త్వరలో తమిళంలో కూడా ఓ ఐటం చేయడానికి రెడీ అవుతోంది. విక్రమ్‌ హీరోగా, సమంత హీరోయిన్‌గా, విజయ్‌మిల్టన్‌ దర్శకత్వంలో మురుగదాస్‌ నిర్మిస్తున్న ‘10 ఎణ్ణాదుకుళ్లు’ చిత్రంలో ఆమె హాట్‌ హాట్‌గా కనిపించనుంది.

ఈ పాట సినిమాలో 9 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. ఈ పాట కోసం 2.25కోట్లతో ఓ భారీ సెట్‌ను వేశారట. ఇక ఈ చిత్రంలో బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సాంగ్ లో తన అందాలు ఏ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేస్తుందో మరి..!

మరింత సమాచారం తెలుసుకోండి: