వెరీ రీసెంట్ గా వర్మ హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఇది సమసిపోయేలోపే వర్మ మరో కాంట్రవర్సీకు తెరలేపాడు. వివరాల్లోకి వెళితే, ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ‘నేను అరెస్టయ్యా..’ అంటూ పోస్ట్ చేసిన ఒక ట్వీట్ అతన్ని వివాదాల్లోకి నెట్టేసింది. ఇదిలా ఉంటే వర్మ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న దాదాగిరి పై ఓ సినిమాని తెరకెక్కించే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది.

గతంలో తెలుగు సినిమాలు రిలీజ్ చేయటానికి, టాలీవుడ్ లో చక్కటి వాతావరణం ఉండేది. ఇప్పుడు మాత్రం ఓ మూవీని రిలీజ్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. పెద్ద వాళ్ల చేతిలో ధియోటర్స్ ఉండిపోవడంతో, చిన్న మూవీలతో పాటు, బడా మూవీలు సైతం రిలీజ్ కోసం తెగ ఇబ్బందులు పడుతున్నాయి.

దీంతో వర్మ ఈ కాన్సెఫ్ట్ తో ఓ మూవీని తెరకెక్కించే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన స్టోరి డిస్కషన్స్ కూడ వేగంగా జరగుతున్నాయంట. కేవలం సింగిల్ షెడ్యూల్ లోనే ఈ మూవీని వర్మ పూర్తి చేసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, వర్మ ఎవరిని టార్గెట్ చేస్తాడో అని ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్దలు తెగ హైరానా పడుతున్నాడు.

వర్మ తెరకెక్కించబోతున్న ఈ మూవీలో ట్విస్టేంటే, మూవీలోని పాత్రల పేర్లను రియాలిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలోని వారి పేర్లను, సినిమాలోనూ పెడతారనే టాక్ వినిపిస్తుంది. ఈ మొత్తం మూవీకి తను “డిస్ట్రిబ్యూషన్” అనే టైటిల్ ని సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ సినిమాను టాలీవుడ్ కి వ్యతిరేకంగా తెరకెక్కిస్తే, కనీసం డిస్ట్రిబ్యూషన్ అనే సినిమాకి థియోటర్స్ దొరకటం కష్టమే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: