రాజధాని భూసేకరణ వివాదాలలో వేడెక్కి పోతున్న రైతులను పలకరించడానికి పవన్ చేపట్టిన ప్రజాయాత్ర చిన్నచిన్న అడ్డంకులు ఎదురైనా జెట్ వేగంతో కొనసాగిపోతోంది. ఈ యాత్రకు మహిళల స్పందన కూడా చాల ఎక్కువగా వస్తోంది. మహిళలు చెపుతున్న వారి కష్టాలను పవన్ చాల ఓర్పుతో మరియు సహనంగా వింటున్నాడు.

కొద్ది సేపటి క్రితం గుంటూరు జిల్లా బేతకూడిలో జరిగిన సమావేశంలో రాజధాని నిర్మాణానికి 8 వేల ఎకరాలు సరిపోతాయని 33 వేల ఎకరాలు ఎందుకు రైతులను బలవంత పెట్టి తీసుకుంటున్నారో తనకు అర్ధం కావడంలేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్.

బలవంతంగా రైతుల అయిష్టంతో భూములు లాగేసుకుంటే మాత్రం తాను రైతుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సంచలన ప్రకటన చేసాడు పవన్. సింగపూర్ లాంటి రాజధాని నిర్మించు కోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటూ తెలుగుదేశం ప్రభుత్వం పై సెటైర్లు వేసాడు పవన్.

రైతుల రుణమాఫీ చేయడానికి డబ్బులు లేని రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్న భూములకు ఎప్పటికి నష్ట పరిహారం చెల్లించగలుగుతుందని ప్రశ్నించాడు పవన్. ఎటువంటి ఆవేశం లేకుండా స్పష్టమైన అభిప్రాయాలతో ఈరోజు రాజధాని గ్రామ ప్రాంతాలలో పవన్ కొనసాగిస్తున్న ప్రజాయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల విషయంలో అనేక సంచలనాలకు భవిష్యత్ లో మార్పులు తీసుకువచ్చే అవకాశాలు పవన్ మాటలలో స్పష్టం అవుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: