సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడిగా 1971లో రూపొందిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. తెలుగు తెరపై కౌబాయ్ కథాంశంతో రూపొందిన తొలి సినిమాగా ఖ్యాతి గడించింది. ఇది కృష్ణ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. దాదాపు నలభైనాలుగేళ్ల విరామం తర్వాత ఇదే టైటిల్‌తో కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు ఓ సినిమా చేస్తున్నారు.

క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 2013లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘స్వామిరారా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతుంది. సుధీర్‌బాబు, నందిని జంటగా నటిస్తున్న ఈ సీక్వెల్‌కు ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే టైటిల్ ఖరారు చేశారు.

అయితే మొదట ఈ చిత్రాన్ని, నిఖిల్-కలర్ స్వాతిలతో సీక్వెల్ ని తీయాని దర్శకుడు అనుకున్న, వారిద్దరి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ మూవీని సుధీర్-నందిత కాంబినేషన్ లో తెరకెక్కించాలని దర్శకుడు అభిప్రాయపడ్డాడట. కాని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నసమాచారం మేరకు, స్వామిరారా మూవీ సీక్వెల్ కి నిఖిల్-కలర్ స్వాతి ఇద్దరూ వారి రెమ్యునరేషన్ ని డబుల్ చేసి అడుగుతుండటంతో, నిర్మాతలు ఇందుకు ఆసక్తి చూపించలేదనే టాక్ వినిపిస్తుంది. ఫైలన్ గా స్వామిరారా మూవీ సీక్వల్ సుధీర్ కి ఓ వరంగా వరించదని అంటున్నారు.

అయితే ఈ మూవీ సక్సెస్ అయితే, సుధీర్ ఫిల్మ్ కెరీర్ ఇది ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదమైన తొలి చిత్రంగా గుర్తింపును పొందింది. అదే టైటిల్‌తో సుధీర్ సినిమా రావడటం తనకు ఆనందంగా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: