మృత్యువు అంచు వరకు వెళ్ళి బయటపడిన అమీజాక్సన్ ప్రమాదపు వార్తలు కోలీవుడ్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బ్రిటీష్ మోడల్ గా పేరు సంపాదించుకున్న అమీజాక్సన్ ప్రస్తుతం కోలీవుడ్ లో చాల సినిమాలలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వం వహించిన ‘ఐ’ సూపర్ హిట్ ఇవ్వక పోయినా అమీజాక్సన్ కు కోలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నాయి.

అయితే లేటెస్ట్ గా ఆమె చావు అంచుల వరకు వెళ్లి మరొక నటుడి సహాయంతో బయట పడింది. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కేరళాలో జరుగుతోంది.

ఈ సినిమాలోని ఒక సన్నివేశానికి అనుగుణంగా ఓ కొండపై బైక్‌ రైడింగ్ సీన్‌లో నటిస్తున్న అమీ, ఒక్కసారిగా అదుపుతప్పి కొండ మీద నుంచి కింద పడబోయింది. సరిగ్గా ఆ సమయంలో వెనకాల బైక్ పై వస్తున్న నటుడు కరుణాకరన్ ఈమెని కాపాడాడు అని వార్తలు వస్తున్నాయి.

ఈ నటుడు లేకపోతే ఆమెకు పెను ప్రమాదం జరిగివుండేదని యూనిట్ సభ్యులు చెబుతున్నారని మీడియా వార్తలు వ్రాస్తోంది. ఈ సంఘటన తరువాత అమీజాక్సన్ చాలాసేపు షాక్ లోనే ఉందని టాక్. ఆ తరువాత నెమ్మదిగా షాక్ నుండి తేరుకుని తన షూటింగ్ ను కొనసాగించిందట ఈ బ్రిటీష్ బ్యూటీ. తిరుకుమారన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అమీజాక్సన్ చాల పెద్ద ఆశలే పెట్టుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: