టాలీవుడ్ మోస్ట్ హాండ్సమ్ బ్యాచ్ లర్ గా ప్రభాస్ అందరి మనసుల్లో ఉన్నాడు. మరి బాహుబలి లా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఒప్పకున్న తర్వాత మనోడు ఏ సినిమా తీయలేదు. వెండి తెరపై ప్రభాస్ ని చూసి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది. మిర్చి తర్వాత మనోడి సినిమాలే లేవు.

మరి తన తోటి హీరోలందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి. కానీ ప్రభాస్ మటుకు బాహుబలి సినిమా తర్వాతే ఏ నిర్ణయమైనా అంటున్నాడు. కొత్త దర్శకులను ప్రోత్సహించే యంగ్ రెబల్ స్టార్ పెళ్లికి సన్నద్దం అవుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు.

పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా వెండి తెరకు పరిచయం అయిన ప్రభాస్ ఆయన మాటంటే చాలా వేదం. ఏ సినిమా ఒప్పుకోవాలన్నా పెదనాన్నను సంప్రదించాల్సిందే.. అలాగే పెళ్లి పనులు కూడా ఆయన చేతుల్లోనే పెట్టినట్టు తెలుస్తుంది.

మరి ఈ ఆరడుగుల అందగాడికి మనసులో ఎవరైనా ఉన్నారా ? లేదా పెద్ద నాన్న చెప్పినట్లు సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినే చేసుకుంటారా అని అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా బాహుబలికి సరిపోయే అమ్మాయి ఎక్కడ ఉందా అని ఉంటే ఏ రేంజ్ లో ఉంటుందో అని అటు ప్రభాస్ అభిమానులు, సీనీ ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: