నిన్న సాయంత్రం భాగ్యనగరంలో జరిగిన ‘జిల్’ ఆడియో వేడుకలో హీరో గోపీ చంద్ ఆ సినిమా హీరోయిన్‌ రాశీ ఖన్నా పై చేసిన మితిమీరిన పొగడ్తలు అందర్నీ ఆశ్చర్య పరిచాయి. తన ‘జిల్’ సినిమాలో తనతో పాటు కలిసి నటించిన రాశి ఖన్నా టాలెంట్ ను చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని గోపీచంద్ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు.

అంతేకాదు ఆమె ‘జోరు’ సినిమాలో పాడిన టైటిల్ సాంగ్ కు తాను అభిమానిగా మారిపోయానని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అరడజనుకు పైగా సినిమాలును చేస్తున్న రాశీ ఖన్నాకి యాక్టింగ్‌తోపాటు ఇతర టాలెంట్స్‌ వుండటంతో, ఆమె కెరీర్‌ వేగంగా దూసుకుపోతోంది.

ఇక రాబోతున్న ‘జిల్’ సినిమాలో గోపీచంద్ తో కలిసి లిప్ లాక్ సీన్ లో నటించడమే కాకుండా చిట్టిపొట్టి డ్రస్సులతో యూత్ ని ఆకర్షించడానికి చాల ప్రయత్నాలు చేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ బ్యూటీ మరో ఓపెన్ ఆఫర్ టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ఇచ్చేసింది.

తనకు పాత్ర నచ్చితే ఎక్స్ పోజింగ్ విషయంలో తాను ఎటువంటి పరిమితులు విధించుకోనని అవసరం అనుకుంటే తాను స్పెషల్ సాంగ్స్ లో డాన్స్ చేయడానికి సిద్ధం అంటూ సంకేతాలు ఇస్తోంది ఈ బ్యూటీ. ‘లౌక్యం’ లో రకుల్ ప్రీత్ కలిసి వచ్చినట్లుగా ఈ ‘జిల్’ లో రాశి ఖన్నా గోపీచంద్ కు ఎంత అదృష్టాన్ని తెస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: