. .

సింహమంటి చిన్నోడో దూసుకొచ్చాడే అంటు సింహ లో బాలయ్యతో డ్యాన్స్ చేసి బొద్దు సుందరి మీకు గుర్తుండి ఉంటుంది. తన అందాల ఆరబోతతో అటు తమిళ ఇటు తెలుగు ప్రేక్షకులను వెర్రెక్కించిన బొద్దు సుందరి నమిత. నమితగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు నమిత వాంక్వాలా.

ఈమె మే 10, 1980లో గుజరాత్ రాష్ట్రం సూరత్ లో జన్మించింది.1998లో మిస్ సూరత్ గా మరియు 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించినది. జెమిని చిత్రంతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినది. ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత తమిళ, కన్నడ,హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: