సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వస్తున్న మూవీలు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా ఏంటో, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రుచి చూపుతుంది. ఒకప్పుడు బిటౌన్ ఇండస్ట్రీ ఇండియన్ బాక్సాపీస్ ని శాసిస్తుంటే, ఇప్పుడు సీన్ మారి, అది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేతిలోకి వచ్చింది.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని బ్లాక్ బస్టర్ మూవీలను బిటౌన్ లో రిమేక్ చేసి, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంచక్కా కలెక్షన్స్ ని కొల్లగొట్టుకుంటుంది. ఇదిలా ఉంటే, తాజాగా దర్శకుడు రాజమౌళి సైతం, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన సెలబ్రిటీగా మారాడు. ఎందుకంటే రాజమౌళి కోసం గత సంవత్సర కాలంగా ఓ బిటౌన్ పాపులర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూజర్ ఎదురుచూస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే, ‘బాహుబలి’ సినిమా మే 15న విడుదలవుతుందన్న విషయాన్ని రాజమౌళి ఇంతకుముందే తెలియజేశారు. తాజా సమాచారం మేరకు బాహుబలిని హిందీలో విడుదల చేసే హక్కులను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహర్ ఎంత మేరకు చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకున్నారన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

అయితే కరణ్ జోహార్ దాదాపు సంవత్సర కాలం పాటు, బాహుబలి మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నాడంట. అంతే కాకుండా బాహుబలి ఫైనల్ ఎడిటింగ్ ని చూడటానికి రాజమౌళి వద్ద స్సెషల్ పర్మిషన్ తీసుకున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా దాదాపు సంవత్సరం పాటు రాజమౌళి చేసే మూవీ కోసం వెయిట్ చేసిన బిటౌన్ దర్శకుడిగా కరణ్ జోహార్ పేరు బిటౌన్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: