ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న న్యూస్ మా అధ్యక్షుడికి జరగబోతున్న ఎన్నికలు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు ఈనెల 29న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉపాధ్యక్ష పదవులకు శివకృష్ణ, మంచు లక్ష్మిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా పదవులకు కార్యనిర్వహక ఉపాధ్యక్షుడుగా తనికెళ్ళ భరణి, మా ప్రధాన కార్యదర్శిగా శివాజీ రాజా, కార్యదర్శిగా ఆలీ ఎన్నికయ్యారు.

అయితే అధ్యక్ష పదవికి మాత్రం ఎన్నిక తెప్పేదిలా లేదు. అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, సహజ నటి జయసుధ ఇద్దరు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో అధ్యక్ష పదవిని ఏకగ్రీవంగానే ఎన్నుకున్నా ఈసారి మాత్రం ఎన్నిక తప్పనిసరైంది. నిజానికి కొన్ని రోజుల క్రితం వరకూ మా అధ్యక్ష పదవికి ఎవ్వరూ పోటీ నిలబడలేదు. రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా దాదాపు అందరూ ఒప్పుకున్నారు. తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న గ్రూపు రాజకీయాల పరిణామాల కారణంగా ఇప్పుడు ఈ పోటీ తప్పని సరి అవుతుందని అంటున్నారు.

రాజేంద్రప్రసాద్ కి అండగా మెగా ప్యామిలి ఉండగా, జయసుధకి అండగా దాసరి వర్గం ఉందంటూ ప్రముఖ టీ.వి ఛానల్ 30నిముషాల ప్రత్యేక కథనాన్ని టెలికాస్ట్ చేసి, సంచలనం క్రియేట్ చేసింది. అల్లుఅర్జున్ ఫంక్షన్ లో దాసరి వాఖ్యలు, రుద్రమదేవి ఆడియో ఫంక్షలో అల్లుఅర్జున్ కౌంటర్, ఇలాంటి వ్యవహారాలు ఇండస్ట్రీలో ఆధిపత్య పోరుకి అద్ధంపట్టేలా కనిపిస్తుంది. దీంతో మెగా వర్సెస్ దాసరి అన్నట్టుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అంటున్నారు.

అయితే ఉపాధ్యక్షలుగా ఎన్నికయిన మంచు లక్ష్మి, రాజేంద్రప్రసాద్ కి సపోర్ట్ ఇస్తుందని అనుంటే, తను జయసుధకి సపోర్ట్ గా మారి అందరికి షాక్ ఇచ్చారు. దాసరికి, మోహన్ బాబుకి మంచి సన్నిహిత పరిచయం ఉండటంతోనే ఇది సాధ్యపడిందని అంటున్నారు. మంచు లక్ష్మి సపోర్ట్, మా అద్యక్ష పదవిపై కొంత మేర ప్రభావితం చూపుతుందని అంటున్నారు.

మొత్తంగా దాసరి వర్కెస్ మెగా అన్నట్టుగా సాగుతున్న మా అధ్యక్ష పదవి ఎన్నికల తీర్పు ఎలా ఉంటుంది అనేది? చాలా రసవత్తరంగా ఉంటుంది. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మురళీ మోహన్ తన పూర్తి మద్దతును జయసుధకు ప్రకటించిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: