“సన్నాఫ్ సత్యమూర్తి”  విడుదల తేదీ పై ఇంకా స్పష్టత లేకపోయినా ఈ సినిమా కథకు సంబంధించిన ఒకొక్క విషయం చిన్నగా మీడియాకు లీక్ అవుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా క్లైమాక్స్ సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి.


ఈ సినిమా క్లైమాక్స్ 25 నిముషాలు


ఈ సినిమా క్లైమాక్స్ 25 నిముషాలు ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు గుండెకాయలా సెకండ్ ఆఫ్ నిలుస్తుందని టాక్. ఫస్ట్ ఆఫ్ అంతా ఫన్ తో నడిచిపోయి ఇంటర్వెల్ తరువాత త్రివిక్రమ్ ప్రేక్షకులను సీరియస్ మోడ్ లోకి తీసుకు వెళ్ళిపోతాడు  అని టాక్. ఈ సందర్భంలోనే యాక్షన్ సీన్స్ కూడా భారీగా ఉంటాయని ఫిలింనగర్ టాక్.


త్రివిక్రమ్ మలిచాడని ఈ సీన్స్


‘అత్తారింటికి దారేది’ తరువాత వస్తున్న త్రివిక్రమ్ సినిమా కావడంతో క్లైమాక్స్ సీన్స్ సగటు ప్రేక్షకుడి హృదయాలను స్పందించే విధంగా చాల ఎమోషనల్ గా  త్రివిక్రమ్ మలిచాడని ఈ సీన్స్ చూడటానికే పదేపదే ప్రేక్షకులు ఈ సినిమాకు వస్తారని ఈ సినిమా యూనిట్ పూర్తి నమ్మకం పై ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే బన్నీ త్రివిక్రమ్ ల నుండి మరో బ్లాక్ బస్టర్ హిట్  ఖాయం అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: