భారీ పారితోషికాలు ఇస్తే ఎక్స్ పోజింగ్ దగ్గర నుంచి లిప్ లాక్ ల వరకు రెడీ చెప్పే హీరోయిన్స్ ఒక సినిమాలో మాత్రం నటించడానికి హడలి పోతున్నారు. ఆ సినిమా దర్శక నిర్మాతలు ఎంత భారీ తోషికం ఇస్తామన్నా ఆ సినిమాలో నటించడానికి పెద్ద  హీరోయిన్స్ దగ్గర నుంచి చిన్న హీరోయిన్స్ వరకు ఆ సినిమా నిర్మాతను తప్పించుకుని తిరగటం ఇప్పుడు బాలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారింది.  


బాలీవుడ్ యంగ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ 'XXX' పేరుతో సెక్స్ ప్రధాన మైన బూతు సినిమాను తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలు వెబ్ మీడియాలో చాల సంచలనం సృస్టించాయి.  ‘కామసూత్ర' ఆధారంగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో నటించడానికి హీరోయిన్ దొరకక పోవడం ఈ సినిమాను నిర్మిస్తున్న ఏక్తా కపూర్ కు సమస్యగా మారింది అని వార్తలు వస్తున్నాయి. 


దీనికి కారణం ఈ సినిమాలో శృతి మించిన శృంగార సీన్లు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని టాక్. కొంత మంది వచ్చినా ఆ సినిమాకు సరిపడే స్థాయిలో లేరట. వాలంటైన్ డే రోజు విడుదల చేసిన 'XXX' పోస్టర్స్, ఫస్ట్ లుక్ చూసిన వారు షాక్ అవుతున్నారు. అయితే ఇంత బూతు సినిమాకు సెన్సార్ ఒప్పుకుని రిలీజ్ చేయడానికి అంగీకరిస్తుందా? అనే వార్తలు కూడా ఉన్నాయి. 


సిల్క్ స్మిత జీవితాన్ని ‘డర్టీ పిక్చర్’ గా మార్చి కోట్లు సంపాదించుకున్న ఏక్తా కపూర్ ఈ బూతు సినిమా ద్వారా ఎన్ని వందల కోట్లు సంపాదిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: