మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సన్నాఫ్ సత్యమూర్తి పై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 2న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం వాయిదా పడిందనే వార్తలు ఉన్నాయి. కానీ రేయ్ సినిమా దృష్టిలో ఉంచుకొన  ఏప్రిల్ 8 లేదా 9న విడుదల చేయాలనుకుంటున్నారట.

త్రివిక్రమ్ తీస్తే సినిమాలో ఉగాది పచ్చడి లా ఉంటుంది. అన్ని రుచులు సమ్మిళితమై ఉంటాయి. కామెడీ, యాక్షన్, డ్యాన్స్, సెంటిమెంట్,రోమాంటిక్ అన్నీ హంగులూ అందరికీ నచ్చేలా తీస్తాడు. అందుకే ఆయన సినిమాలంటే ఆడియన్స్ కి అంత పిచ్చి. అయితే సన్నాఫ్ సత్యమూర్తి సంబంధించిన క్లయిమ్యాక్స్ గురించి ప్రస్తుతం ఫిల్మీనగర్ లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని క్లయిమ్యాక్స్ సీన్ 25నిముషాల పాటు ఉంటుందట. ఈ 25 నిముషాల సీన్ లో అల్లు అర్జున్ ఓ రేంజ్ లో చెలరేగిపోయాడని, అతని నటన ఈ సీన్ కి హైలెట్ గా నిలుస్తుందని సమాచారమ్. 


అత్తారింటికి దారేది సినిమాలో క్లయిమాక్స్ లో పవన్ కళ్యాన అద్భుతంగా నటించాడు. చిత్రంలో సమంత,నదియా


పవన్ కళ్యాన్ అత్తారింటికి దారేది సినిమాలో క్లయిమాక్స్ సీన్ రైల్వే స్టేషన్ లో ఎంత ఎమోషనల్ సీన్ అందరికీ తెలుసు అసలు ఆ సినిమా ఆడటానికి కారణమే క్లయిమాక్స్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలోని క్లయిమ్యాక్స్ సీన్ కూడా ఆ రేంజ్ లో ప్రేక్షకాదరణ పొందడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి క్లయిమ్యాక్స్ సీన్ హైలెట్ గా నిలుస్తుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: