త్రిష వరుణ్ మణియన్  తో ప్రేమాయణం సాగిస్తున్నప్పుడు త్రిష పేరు చెపితే దర్శక నిర్మాతలు అందరు పారిపోతూ ఉండేవారు. అయితే వరుణ్ మణియన్ తో నిశ్చితార్ధం జరిగిన కొద్ది రోజులకే త్రిష కెరియర్  లో ఊహించని మలుపు తిరిగింది. అప్పటి దాక ఆమె పేరు చెపితే పారిపోయిన దర్శక నిర్మాతలు తిరిగి ఆమె ముందు క్యూ కట్టడం మొదలు పెట్టారు.

ప్రస్తుతం త్రిష  చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి అంటే ఈ చెన్నై బ్యూటీ లక్ ఎలా తిరిగిందో అర్ధం అవుతుంది. దీనికి తోడు త్రిష లేటెస్ట్ గా తన దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్న గిరిధర్ అనే వ్యక్తి నిర్మించబోతున్న ఒక హారర్ మూవీలో నటించడానికి అంగీకారం తెలిపింది.  ఈ సినిమాను తెలుగు తమిళ భాషలలో నిర్మిస్తారని టాక్.

ట్విస్ట్ ఏమిటంటే బయట సినిమాలు ఇన్ని వరస పెట్టి చేస్తున్న త్రిష గతంలో తన ప్రేమికుడు వరుణ్ మణియన్ నిర్మాతగా కోలీవుడ్ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించింది. అయితే త్రిష చేతిలో సినిమాలు ఎక్కువై పోవడంతో తన ప్రేమికుడి వరుణ్ మణియన్ సినిమాను క్యాన్సిల్ చేసుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. 

అయితే అనుకోని ఈ షాక్ కు ఖంగ్ తిన్న వరుణ్ మణియన్ ఈ విషయమై త్రిషను ప్రశ్నిస్తే సినిమాలు ఎక్కువై పోవడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని త్రిష తన ప్రేమికుడి మైండ్ బ్లాంక్ చేసిందని టాక్. ఈ వార్తల పై వ్యాఖ్యానిస్తూ కోలీవుడ్ మీడియా ప్రస్తుతం వరుణ్ మణియన్ సినిమాను వదులుకున్నట్లుగానే త్రిష తన సినిమాల కోసం తన పెళ్లిని కూడా వాయిదా వేసుకోవడమో లేదంటే విరమించు  కోవడమో ఈ చెన్నై బ్యూటీ చేస్తుందేమో అంటూ  కోలీవుడ్ మీడియా సెటైర్లు వేస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: