వర్మ ఎప్పుడూ ఏదొక విషయంలో హాట్ టాపిక్ గా ఉంటాడనే విషయం తెలిసిందే. అయితే తాజాగా తను క్రికెట్ పై చేసిన కామెంట్స్ బిటౌన్ లోని ఓ సెలబ్రిటిని బాధించాయంట. దీంతో వర్మ చేసిన ట్వీట్ కి రియాక్షన్స్ ని ఇచ్చింది. ట్వీట్ లోని ప్రతి మాటకి తను కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చింది. వివరాల్లోకి వెళితే, వర్మ ట్వీట్ కి రియాక్షన్ ఇచ్చిన బ్యూటీ ఎవరంటే, తనే అనుష్క శర్మ.

అసలే ఒక్క రన్ తో వెనుదిరిగిన తన లవర్ విరాట్ కోహ్లి ఆటతీరుపై బాధ పడుతున్న అనుష్కశర్మ, ఇప్పుడు వర్మ చేసిన కామెంట్స్ తనని బాధించాయంట. దీంతో వర్మని ఉతికి పారేసిందంటూ బిటౌన్ లో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ వర్మ చేసిన కామెంట్స్ ఏమిటంటే,  “టీమిడియా ఓడిపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

ఎందుకంటే నేను క్రికెట్ ను ద్వేషిస్తాను. నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే క్రికెట్‌ను ద్వేషిస్తున్నాను. క్రికెట్ వల్ల దేశానికి చాలా నష్టం కలుగుతోంది. చాలా మంది క్రికెట్ మ్యాచ్ సమయంలో పని చేయకుండా టీవీలు చూస్తూ ఉండి పోతున్నారు” అని వర్మ ట్వీట్ చేసారు. “‘క్రికెటైటిస్' అనే ప్రమాదకరమైన వ్యాధి నుండి ఈ దేశ పౌరులను కాపాడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. టీమిండియాను మళ్లీ మళ్లీ ఓడించాలని ఇతర దేశాల జట్లను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ దేశ పౌరులు క్రికెట్ చూడటం ఆపేసి, చక్కగా పని చేసుకునే ఆలోచన వచ్చే వరకు ఇలానే పదే పదే ఓడించాలని కోరుకుంటున్నాను” అని వర్మ ట్వీట్ చేసారు. 

వర్మ చేసిన ఈ కామెంట్స్ కి అనుష్క శర్మ ఈ విధంగా సమాధానం చెప్పిందట. “వ్యక్తిగత కామెంట్స్ చేసుకుంటే తప్పులేదు కాని, జాతిని ఉద్ధేశించిన కామెంట్స్ చేయటం ఇబ్బందికరం. ఇక వర్మ విషయానికి వస్తే తను చేసిన కామెంట్స్ నాన్సెన్స్” అంటూ కొట్టి పారేసింది. మొత్తంగా వర్మతో పెట్టుకున్న అనుష్క శర్మకి వర్మ ఎటువంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: