నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు రో.. నరులెవరూ తిరగనిది ఆ రూట్లో నే నడిచెదరో.. అంటూ జనాలంతా ఓ వైపు ఉంటే మనోడు మటుకు మరోవైపు ఉంటాడు. ఎవరబ్బా ఆ మహా మనిషి అనుకుంటున్నారా ఇంకెవరండీ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ట్విట్టర్ లో ఈయన తిక్క మళ్లీ చూపించాడు.  


తనకు క్రికెట్ అంటే ఇష్టం లేదన, భారత్ ఓడినందుకు సంతోషమని తెలుపుతూ రాంగోపాల్ వర్మ ట్విట్ 


వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమ్ ఇండియా ఓడిందంటూ ఫుల్ హ్యాపీ ప్ర‌ద‌ర్శించాడు.  భారత జట్టును ఇత‌ర దేశ‌ క్రికెట్ జట్లు ఓడించాలని, అప్పుడు ఇండియాలో క్రికెట్ ఆడటం మానేస్తారని ఆయన తన ట్విట్ చేశాడు. అంతేకాకుండా మందుకు, సిగరెట్ల కంటే క్రికెట్ కు బానిస అయిన వారివల్ల దేశానికి ఎంతో ప్రమాదమని, దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా తమ పనులు చేయడం మానేసి, క్రికెట్ చూస్తున్నారని చెప్పుకొచ్చాడు వ‌ర్మ‌.
 
భారత దేశంలో ఎనభై శాతం వరకు క్రికెట్ అంటే పిచ్చి ఉన్నవారే ఉన్నారు. అంతెందుకు క్రికెట్ ఒక మతం సచిన్ ఒక దేవుడు అనే నానుడి ఉంది. దేశానికి పట్టిన క్రికటైటిస్ అనే జబ్బు నుంచి దేవుడే కాపాడాలంటూ ట్వీట్ చేసి తన తీరు ఏంటో మ‌రోసారి చూపించాడు. తనను ఇష్టపడే వారికంటే ద్వేషించే వారినే ఎక్కువ ఇష్టపడతానని, ఎందుకంటే ప్రేమ కంటే ద్వేషం ఎక్కువ స్పైసి గా ఉంటుందని ఆయన చివర్లో చెప్పుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: