విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురుగా తెలుగు తెరకు పరిచయం అయిన శ్రుతిహాసన్ మొదటి నుంచి కాంట్రవర్సీ న్యూస్ లకు నాంధి పలుకుతుంది. ఈ అమ్మడు తెలుగు లో చేసిన సినిమాలు మంచి టాక్ వచ్చినా శ్రుతికి మాత్రం అంత క్రేజ్ రాలేదు. అగ్రహీరోలతో నటించినప్పటికీ పెద్ద పేరు రాకపోవడం తో బాలీవుడ్, కోలీవుడ్ పై కన్ను వేసింది. తాజాగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ కోర్టులో ఫిర్యాదు చేసింది. శ్రుతిహాసన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ సినిమా చిత్రీకరణకు హాజరుకావడం లేదని, దాంతో తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ఆ సంస్థ హైదరాబాద్ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేసింది. నాగార్జున-కార్తీ కాంబినేషన్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించేందుకు సైన్ చేసింది. ఇందుకు గాను ఆమె పిక్చర్ హౌస్ మీడియాతో ఒప్పందం చేసుకుంది.


తండ్రి కమల్ హాసన్ తో శ్రుతి హాసన్


ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో ఇప్పటి వరకు ఆమె షూటింగ్‌లో పాల్గోలేదు. ఇతర భాషా చిత్రల్లో బిజీ కావడం వలన తాను డేట్లు సర్దుబాటు చేయలేకపోతున్నానని ఈ విషయాన్న సింపుల్ గా మెయిల్ చేసిందట దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు బాధిత దర్శక నిర్మాతలు ఈమెపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేసిందట. ఈ కేసును విచారించిన సివిల్ కోర్డు న్యాయమూర్తి తదుపరి ఆర్డర్లు ఇచ్చే వరకు శృతీహాసన్ కొత్త సినిమాలకు సంతకం చేయకూడదని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: