సినిమా రంగంలో ఉన్న సెంటిమెంట్లు మరే రంగంలోనూ ఉండవు. ఈ సెంటిమెంట్ల కోసం తమ సినిమా టైటిల్స్ దగ్గర నుంచి సినిమాల రిలీజ్ డేట్స్ వరకు ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. టాప్ హీరోల సినిమాలకైతే ఈ సెంటిమెంట్లు  మరీ ఎక్కువ. అల్లుఅర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విడుదలను ఏప్రియల్ 2 నుంచి 9 కి మార్చడం వెనుక ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్ల ఒత్తిడి కారణం అంటూ ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి.

అయితే  ఈ వాయిదా వెనుక బయ్యర్ల ఒత్తిడితో పాటు మరో బలమైన కారణం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ సినిమా విడుదల వాయిదాకు  అంగీకరించని అల్లుఅర్జున్ కు అనుకోకుండా చిరంజీవి సెంటిమెంట్ గుర్తుకు రావడంతో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వాయిదాకు అంగీకరించాడని టాక్.

గతంలో  ఏప్రియల్ 9, 1992 సంవత్సరంలో చిరంజీవి నటించిన ‘ఘరానామొగుడు’ విడుదలైంది. చిరంజీవి సూపర్ హిట్ సినిమాలలో ఒకటిగా పేర్కొనే ఈ సినిమా అప్పటి రోజులలో 10 కోట్లు వసూలు చేసిన రికార్డు ఈ సినిమా సొంతం చేసుకుంది. టాలీవుడ్ సినిమా రంగంలో 10 కోట్ల కలెక్షన్ రికార్డును క్రియేట్ చేసిన తొలి సినిమాగా ‘ఘరానామొగుడు’ ఆరోజులలో ఒక చరిత్ర సృష్టించింది.

ఇప్పుడు అదే సెంటిమెంట్ తో బన్నీ తన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాను విడుదల చేస్తూ ఉండటంతో బన్నీ కలలు కంటున్న 60 కోట్ల కలెక్షన్స్ రికార్డును అందుకోవడానికి ఈ ఘరానామొగుడు సెంటిమెంట్ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. ఈ సెంటిమెంట్ బన్నీకి కలిసి వస్తే అల్లుఅర్జున్ టాప్ 5 యంగ్ హీరోల లిస్టులో శాశ్విత స్థానం ఏర్పరుచుకున్నట్లే లెక్క..  


మరింత సమాచారం తెలుసుకోండి: