టాలీవుడ్ లో జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల సంగతి పక్కన పెడితే, ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో జయసుధని వ్యక్తిగతంగానూ, మానసికంగానూ బాధించే ఎన్నో కామెంట్స్ ని ప్రత్యర్ధి వర్గం అయిన రాజేంద్రప్రసాద్ ప్యానల్ వారు తనపై ఆరోపించారంటూ జయసుధ తెగ బాధపడింది. అయితే ఆ మాటలకు తను ఇచ్చిన కౌంటర్ అందరి నోళ్ళుని మూయించిందనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

తను మా అధ్యక్ష పదవికే కేవలం మురళీ మోహన్ పోటీ చేయమంటేనే పోటీ చేస్తున్నాను, అలా అని ఆయన చెప్పినట్లే వింటాను అనుకోవద్దు అని చెప్పుకొచ్చింది.అసోసియేషన్ సభ్యుల్లో చిన్నా పెద్దా తేడా ఏమీ లేదన్నారు. నన్ను ఉద్దేశించి ఎగతాళి మాట్లాడుతున్నారు. నేనూ మాట్లాడగలను...నేను మాట్లాడటం మొదలు పెడితే చాలా మంది బాధ పడతారు.

అంటూ ఫినిష్ చేసింది. తను ఇలా మాట్లాడిన తరువాత ఏ ఆర్టిస్ట్ కూడ జయసుధపై పెద్దగా టార్గెట్ చేసి మట్లాడలేదు. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వ్యక్తిగత దూషణలకు వెళ్ళితే, ఆ ఆర్టిస్ట్ వెనుక ఉన్న నిజ జీవిత విశేషాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో జయసుధ కూడ సీనియర్ యాక్టర్ కాబట్టే, ప్రముఖల జీవితాలతో పాటు, దాదాపు ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్స్ జీవితాలు ఎలా ఉంటాయి అనేది తనకి కచ్ఛితంగా తెలుసు.

అందుకే తనని వ్యక్తిగతంగా ఎవరైన అంటే, తను కూడ నోరుపారేసుకోవాల్సి వస్తుందని, అప్పుడు మీరే బాధపడాలి అంటూ ఇండైరెక్ట్ గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతానికి మా సభ్యుల మధ్య ఎటువంటి దూషణలు లేకుండా పోయాయి. లేకపోతే ఈపాటికి ఎందరి జీవితాలతో వారి తెరవెనుక ఎలా ఉన్నాయన్నదానిపై జయసుధ నోరు విప్పిఉండేదని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: