సాధారణంగా సినిమాల్లో నిర్మాణుష్యంగా ఉన్న రోడ్లపై చెట్లు వేసి దాని కాచి దొంగలు కార్లు ఆపి అందులో ఉన్న వాళ్లను నిలువు దోపిడి చేస్తారు ఎదురు తిరిగిన వారిని చితక బాదుతారు అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తారు. ఇది సినిమాల్లో చూస్తే చాలా టెన్షన్ గా టెర్రిఫిక్ గా ఉంటుంది. మరి నిజంగా ఇలాంటి సీన్ బయట జరిగితే అందులోనూ సినిమాలకు ఇలాంటి సీన్లు రాసే రచయితలకు జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవును అచ్చూ అలాగే జరిగింది ఆ బాధితులు ఎవరో కాదు కోన వెంకట్, దానయ్య. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ దారి దోపిడీకి గురయ్యారు. అచ్చంగా సినిమా ఫక్కిలో చోరీ జరిగింది. 


ఇటీవల రాంచరణ్ కొత్త చిత్రం ముహూర్త కార్యక్రమంలో కోన,దానయ్య,శ్రీనువైట్ల,చిరంజీవి,రాంచరణ్,వివివినాయక్, తదితరులు 


సినిమాల్లో చూపించినట్లే దుండగులు రోడ్డుకు అడ్డంగా చెట్టు పడవేసి మరీ దోపిడీకి పాల్పడ్డారు.  నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ కోన వెంకట్‑తో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా దొంగల బారిన పడగా, దర్శకుడు శ్రీను వైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తృటిలో తప్పించుకున్నారు. నగర శివార్లలో జరిగిన  ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాళ్లోకి వెలితే.. ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌ శివార్లలోని ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ ఫామ్ హౌస్‌లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి.


ఆ వేడుకల్లో రచయిత కోన వెంకట్‌, మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఫంక్షన్ అనంతరం రాత్రివేళ కోన వెంకట్, నిర్మాత డీవీవీ దానయ్యలు కలసి ప్రయాణిస్తున్నకారును దోపిడీ దొంగలు అడ్డగించి కారు అద్దాలను పగులగొట్టి వారి దగ్గర వున్న బంగారం, డబ్బు, ఫోన్లు మొత్తం దోచుకున్నారు. దోపిడీకి గురైన సొత్తు విలువ మూడు లక్షల వరకూ వుంటుందని సమాచారం. అదే సమయంలో వీరి వెనుక వస్తున్న మరికొందరు సినీ ప్రముఖులు తమ దారిని మరలించుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనపై రచయిత కోన వెంకట్ షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: