గత కొద్ది రోజులుగా మా ఎన్నికలపై రగడ సాగుతుంది.  ఇది రాజకీయ రంగు పులుముకొని ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరుకుంది. అంతే కాదు జయసుధ, రాజేంద్రప్రసాద్ మధ్య గత కొద్దిరోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.  అయితే ఈ రగడపై కోర్టులో కేసు పెట్టడం దాన్నిపరిగణలోకి తీసుకొని ఎలక్షన్స్ జరపొచ్చు కాని కౌంటింగ్ మాత్రం బహిర్గతం చేయడానికి వీలు లేదని తీర్పు ఇచ్చింది. 
ఇదిలా ఉండగా జయసుధ ప్యానెల్ ఉన్న హేమ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. మొన్న రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి మూవీ అసోసియేషన్ గురించి  కొన్ని వాగ్ధానాలు చేసిన విషయం తెలిసిందే..  


రాజేంద్ర ప్రసాద్, హేమ, జయసుధ


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని సభ్యుల సంక్షేమం కోసం తాము ఐదు కోట్ల నిధులు కమీకరిస్తామని అంటూ రాజేంద్రప్రసాద్ ప్యానెల్ ప్రకటించడాన్ని జయసుధ ప్యానెల్ సభ్యురాలు హేమ తప్పుపట్టారు. ఫండ్స్ ఎలా తెస్తామో , ఏమి చేస్తామో తెలియదు కానీ ఏదోక విధంగా మేమే రిస్క్ తీసుకొని ఐదో పది కోట్ల నిదిగా సమకూర్చుతామని చెప్పిన ఆమె, అవతలి వర్గం మాత్రం మేము కేవలం ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేస్తాం అని చెప్పడం సబబు కాదు అన్నారు. 
 ఒక వేల  ఐదు కోట్లని రాజేంద్రప్రసాద్ ఇప్పుడే మా అసోసియేషన్ ఎకౌంటులోకి ట్రాన్స్ ఫర్ చేసినట్లు అయితే ఇప్పుడే  తమ ఫ్యానల్ అధ్యక్షపదవి నుంచి తప్పుకొని ఆయన్నే ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి తము సిద్దమే అని సవాల్ విసిరింది. దీంతో ఖంగు తిన్న జయసుధ హేమ ఆవేశంలో ఉంది. తాము పోటీ నుంచి తప్పుకునే ప్రస్తకీ లేదని అన్నారు. ఏదేమైనా రేపు జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడుతారో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: