తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న చిన్నది కాజల్ అగర్వాల్. ఏ హీరోకి అయినా జోడీగా కరెక్ట్ మ్యాచ్ అయ్యేలా ఉంటుంది ఈ చిన్నది. మొదట్లో తెలుగు సినిమాలో సింపుల్ గా కనిపించినా మగధీర సినిమా తర్వాత అమ్మడి జాతకమే మారిపోయింది. టాప్ హీరో ల సరసన నటిస్తూ మంచి గ్లామర్ పాత్రలు పోషిస్తూ వావ్.. అనిపించుకుంది. అయితే ఈ మధ్య వార్తల్లో ఈ అమ్మడి పేరు తెగి వినిపిస్తుంది.


కాజల్ మోడలింగ్ చేస్తున్న చిత్రం


ఆ మధ్య తనకు ఐటమ్ సాంగ్ చేయాలనే కోరిక ఉందంటూ ఐటమ్ సాంగ్ అయితే త్వరగా అయిపోతుంది. పేరుకు పేరు డబ్బుకి డబ్బు సమయం వృదా కాదు కాదా ఒక ఐటమ్ సాంగ్ చేస్తే ఫుల్ పాపులారిటీ వస్తుంది కదా అని చిలిపి చిలిపి ఆలోచనలు ఆమె మనసును తడుతున్నాయంటూ సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేసింది. ఈ మధ్య ఒక నిర్మాత తనను మోసం చేశాడంటూ సదరు నిర్మాతపై కేసు కూడా పెడతానంటూ వెర్రెత్తి పోయింది. టాలీవుడ్ పెద్దలు, ఒక హీరో ఈ విషయంలో జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయిస్తామని చెప్పడంతో శాంతించింది. లేదంటే ఆ నిర్మాతను బయటకు ఆగం ఆగం చేయాలనుకుందట. అదండీ సంగతి కాజల్ కి కోపం వస్తే ఇలా రెచ్చిపోతుందన్నమాట..


మరింత సమాచారం తెలుసుకోండి: