దర్శకుడు శ్రీనువైట్లకు ఎవరైనా నచ్చకపోతే వారి పై సెటైర్లు వేయడమే కాకుండా తనకు నచ్చని వారిని తాను తీసే సినిమాలలో క్యారెక్టర్స్ గా మార్చి వారి పై సెటైర్లు వేయడం శ్రీను వైట్లకు వెన్నతో పెట్టిన విద్య.  ఇదే అలవాటుతో కోన వెంకట్, ప్రకాష్ రాజ్ లతో గతంలో శ్రీనువైట్ల వివాదాలు సృష్టించుకుని చివరకు రాజీ పడ్డాడు. ఈ విషయంలో ఈమధ్య మెగా స్టార్ చిరంజీవి శ్రీను వైట్లకు ఒక క్లాసు  పీకినట్లు వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ తో శ్రీనువైట్ల సినిమా తీస్తున్న నేపధ్యంలో ఈమధ్య ఈ దర్శకుడు మెగా కాంపౌండ్ చుట్టూ ప్రదక్షణాలు ఎక్కువగా చేస్తున్నాడు. ఈ  నేపధ్యంలో ఒక సందర్భంలో తనకు ఎదురు పడ్డ శ్రీనువైట్లకు చిరంజీవి ఈ క్లాసు తీసుకున్నాడు అని టాక్. చిరంజీవి తన గత అనుభవాలను శ్రీను వైట్లతో షేర్ చేసుకుంటూ ఎదుటి మనిషి ప్రవర్తన  మనకు నచ్చకపోయినా ఓర్పు వహించి సహనంతో ఉండాలని అలా కాకుండా సెటైర్లు వేస్తూ పోతే సినిమా రంగంలో శత్రువుల సంఖ్య పెరిగిపోతుందని  కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. 

అంతేకాదు ఇదే విషయాన్ని తాను చరణ్ కు కూడా చెపుతూ  ఉంటానని సినిమా రంగంలో విజయం సాధించడానికి మిత్రులు లేకపోయినా ఫరవాలేదు  కాని శత్రువులు ఉండకూడదు అని చిరంజీవి శ్రీనువైట్లకు హితబోధ చేసాడు అని  టాక్. ఈ హితబోధతో శ్రీనువైట్ల కోన వెంకట్ ప్రకాష్ రాజ్ లతో రాజీ పడటమే కాకుండా శ్రీను వైట్ల ప్రవర్తనలో చాల మార్పు వచ్చింది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: