ఈ మధ్య జరిగి  మా’ అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీ పడ్డారు. కాగా, ఈ రెండు ప్యానెల్ లో ఉన్నవాళ్లు, ఒకరినొకరు ధూషించుకుంటూ దాదాపు సార్వత్రిక ఎన్నికలను తలపించారు.  ఎవరికి వారు ఢీ అంటే ఢీ అనే పద్దతిలో మాటలు విసురుకున్నారు. ముఖ్యంగా హేమ, శివాజీరాజా మధ్య మాటలు తారాస్థాయిలో పేలాయి. నాగబాబును టార్గెట్ చేస్తూ హేమ బరిలోకి దిగితే, శివాజీరాజా ఆమెను తుప్పు పట్టిన అస్ర్తం అని నోరు పారేసుకున్నాడు. ఈ విధంగా తెలుగు పరిశ్రమ లో ఇన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయా అన్నంత విధంగా వీరు వార్తల్లోకి ఎక్కారు.


మా ఎలక్షన్స్ సందర్భంగా మీడియాలో మాట్లాడుతున్న హేమ

ఇంతవరకు బాగానే ఉంది మరి ఎలక్షన్స్ అయిపోయాయి. ఫలితాలు పెండింగ్ లో ఉన్నాయి. మరి ‘ మా’ అధ్యక్ష ఎన్నికలు మొదలైనప్పటి నుంచి హేమ వార్తల్లో బాగా నానింది. ముఖ్యంగా  నాగబాబు, రాజేంద్రప్రసాద్ వల్ల మీ కెరియర్ కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, వారిని బహిరంగంగా టార్గెట్ చేసి విమర్శలు చేసారు కదా అని హేమని అడిగితే, అందుకు ఆమె స్పందిస్తూ…


రాజేంద్ర ప్రసాద్, హేమ, నాగబాబు


నాగబాబుగారిని నేను బావయ్య అని పిలుస్తాను. రాజేంద్రప్రసాద్ గారిని అన్నయ్య అని పిలుస్తాను. బావ, అన్నయ్య వల్ల ఏ ఆడవారికైనా ఇబ్బంది ఉంటుందా. నాకు కూడా వారి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.  పోటీ అన్నప్పడు ఎదుటి వారిని మనం విమర్శిస్తాం... వారు మనల్ని విమర్శిస్తారు ఇది కామన్. ఇది మనసులో పెట్టుకొని ఏవో చేస్తారన్న భయం మా సినీ కళాకారులకు అస్సలు ఉండదు. షూటింగ్ లో అందరం కలిసి మెలిసి నటించాల్సి వస్తుంది. అందరం ఆప్యాయంగా పలకరించుకుంటా. కాబట్టి ఎవరి వల్లా నా కెరీర్ కి ఆటంకం కలగదు.


మరింత సమాచారం తెలుసుకోండి: