అందాల నటి కాజల్ అగర్వాల్ కి ప్రస్తుతం తెలుగులో సినిమా చాన్సులు అంతగా లేవు. ఈ మద్య వచ్చిన టెంపర్ సూపర్ అయినప్పటికీ సినిమా చాస్సులు రాకపోవడంతో బాలీవుడ్, కోలీవుడ్ వైపు కన్నేసింది. రజినీకాంత్ అల్లుడు మాస్ హీరో ధనుష్ కొత్త చిత్రం తీస్తున్నాడు. దీనికోసం కాజల్ ని సంప్రదించగా భారీ పారితోషికం డిమాండ్ చేసిందట.  మాస్ హీరో ధనుష్ కథానాయకుడిగా ‘మారి’ చిత్రం తీస్తున్నాడు. ఈ సినిమాలో నటిస్తూ, తన వండర్ బార్ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  బాలాజీ మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.  అంతా బాగానే ఉంది కానా ఈ  చిత్రబృందం కాజల్ అగర్వాల్ పై ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.


కాజల్ అగర్వాల్ 


అందాల ముద్దుగుమ్మ కాజల్ అడిగినంత పారితోషికం ఇచ్చారు కదా ఏ మాత్రం గౌరవం  లేకుండా షూటింగ్ కి  ఇబ్బందిపెడుతోందని భోగట్టా. అయితే మొదట్లో బాగానే వచ్చినా ఇప్పడు మటుకు  చెప్పిన సమయానికి షూటింగ్ కి రాకపోవడంతో పాటు ఇచ్చిన తేదీలను మార్చడం.  దీనికి కారణం అల్ రెడీ ఈ  ఓ హిందీ చిత్రానికి తేదీలు కేటాయించే దిశలో ఈ తమిళ చిత్రాన్ని ఇబ్బందులపాలు చేస్తోందని వినికిడి. దీంతో కాజల్ పై మండి పడ్డ  దనుష్ మరియు ‘మారి’ బృందం ఆగ్రహావేశాలతో ఉన్నారట. ధనుష్   అయితే ఈ అమ్మడిపై  మీద చాలా మంటగా ఉన్నాడు అందుకని కాజల్ వ్యవహారం గురించి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయాలని కూడా అనుకుంటున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: