సూపర్ స్టార్ కృష్ణ  సినిమా రంగంలో  ప్రవేసించి  50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తన మొదటి సినిమా ‘తేనె మనసులు’ దగ్గర నుంచి నేటి యంగ్ హీరోల వరకు అనేక విషయాల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ  ఈ వ్యాఖ్యలు చేసాడు. తన కొడుకు మహేష్ తన  స్థానాన్ని నిలబెట్టాడు అంటూ కథల ఎంపికలో మహేష్  కూడా తనలాగే వైవిధ్యమైన సినిమాలలో నటిస్తున్నాడని కామెంట్ చేసాడు కృష్ణ.


మహేష్ కు ఇటువంటి ప్రయోగాలు  చేయవద్దు


ప్రస్తుతం టాప్ హీరోల సినిమా నిర్మాణ వ్యయం అదుపు  తప్పుతోంది అనే కామెంట్ చేస్తూ మహేష్ ‘వన్’ నేనొక్కడినే సినిమాకు 70 కోట్లు ఖర్చు అయ్యాయి అని తెలిసినప్పుడు ఈ విషయమై తాను మహేష్ కు ఇటువంటి ప్రయోగాలు  చేయవద్దు అంటూ సలహా ఇచ్చానని చెప్పాడు కృష్ణ. టాలీవుడ్  ప్రస్తుత  మార్కెట్ పరిస్థుతులలో ఏ సినిమాపైన అయినా 40 కోట్లు మించి పెట్టుబడి పెట్టడం మంచిది కాదని ఇదే విషయాన్ని  తాను మహేష్ కు చెప్పడంతో తన  సినిమాల బడ్జెట్ ను తగ్గించుకోవడమే  కాకుండా  నిర్మాతల శ్రేయస్సు ను దృష్టిలో పెట్టుకుని తన సలహాతో మహేష్ తన పారితోషికాన్ని కూడా తగ్గించుకున్నాడు అని కామెంట్స్ చేసాడు కృష్ణ.


టాలీవుడ్ యంగ్ హీరోలలో బాగా అభిమానించేది హీరో  ప్రభాస్


మహేష్ తరువాత తాను టాలీవుడ్ యంగ్ హీరోలలో బాగా అభిమానించేది హీరో  ప్రభాస్ అని అంటూ ప్రభాస్ నటన తనకు బాగా నచ్చుతుందని కామెంట్స్ చేసాడు కృష్ణ. మహేష్ బాబును జేమ్స్ బాండ్ గా చూడాలని తన  కోరిక అంటూ  మంచి కథ  దొరికితే తనకు మహేష్, గౌతమ్ లతో కలిసి నటించాలని ఉంది అన్న కోరికను మరోసారి బయట పెట్టాడు కృష్ణ.  సినిమా  రంగంలో నెంబర్ వన్ పొజిషన్ ఎవరికీ శాస్వితం కాదని  అది ప్రతి సంవత్సరం మారిపోతూ హీరోలతో ఆడుకుంటుంది ని కామెంట్  చేసాడు


మరింత సమాచారం తెలుసుకోండి: