కొన్ని సినిమా చరిత్రను సృష్టిస్తాయి. నటులకు, రచయితలకు, దర్శకులకు, సంగీత దర్శకులకు అందరినీ అందనంత ఎత్తుకు తీసుకు వెళ్తాయి. అలాంటి సినిమాల జాబితాలోకి వచ్చేది ఖైది. చిరంజీవి కెరియర్ లో ఇదో పెద్ద బ్లాక్ బస్టర్. కోదండరామిరెడ్డి దర్శకుడిగా కీర్తి గడించిన చిత్రం... ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతంచేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే. ఖైదీ చిత్రంతో సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలయ్యింది. చిరంజీవిని అగ్రనటునిగా , కోదండరామిరెడ్డి ని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి బ్రదర్స్ ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం. 


ఖైదీ చిత్రానికి సంబంధించిన పోస్టర్


 చిత్ర కథనానికి వస్తే  సూర్యం ఒక చురుకైన విద్యార్థి. ఐ.ఎ.ఎస్. చదవాలని ఆశయం. తండ్రి చిన్న రైతు. విధవరాలైన ఒక అక్క(సంగీత). అదేవూరికి చెందిన వీరభద్రయ్య (రావు గోపాలరావు) కూతురు మాధవి సూర్యాన్ని ప్రేమిస్తుంది.  వారి మధ్య సాన్నిహిత్యాన్ని గమనించిన మునసబు వీరభద్రయ్య కు చెబుతాడు.

సుమలత, చిరంజీవి ల మధ్య పాటలోని దృశ్యం


వీరభద్రయ్య సూర్యం తండ్రి మరణానికి కారణమౌతాడు. తండ్రి చేసిన అప్పు తీర్చటానికి పొలాన్ని వీరభద్రానికి ఇచ్చేసి ,దానినే కౌలుకి సాగు చేస్తుంటాడు. అందులో పంటను వీరభద్రయ్య తీసుకు పోతాడు. తమ్ముడు అసహాయంగా ఉండటానికి తానే కారణమనుకుని సంగీత ,మునసబు ను పెళ్ళి చేసుకుని ,అతని చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ సంఘటన హత్యగా చిత్రీకరించి ,నేరాన్ని సూర్యంపై మోపుతారు.వారిపై పగ సాధిస్తానికి సూర్యం ప్రయత్నిస్తున్నాడు.  అలా తన కుటుంబానికి అన్యాయం చేసి వారిపై పగ తీర్చుకుంటాడు సూర్యం. సూర్యం పాత్రలో చిరంజీవి అద్భుతమైన నటన ప్రదర్శించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: