మంచు లక్ష్మి ఈ మధ్య వార్తల్లో టాక్ ఆఫ్ ది టౌన్. మంచు మోహన్ బాబు కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఎక్కవగా బుల్లితెరపై రక రకాల షోలు చేస్తూ అందరి మనసులు దోచేస్తుంది. గతంలో ఈమె హాలీవుడ్ లో కూడా నటించింది. మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్ గా సినీరంగంలోకి దూసుకెళ్తుంది. నటిగా కొన్ని సినిమాలే తీసిన మంచి గుర్తింపు వచ్చింది.  ఇక నిర్మాతగా మంచి సినిమాలు నిర్మిస్తూ శభాష్ అనిపించుకుంటోంది. తాజాగా మంచు లక్ష్మీప్రసన్న మరో టాలెంట్ ని చూపించబోతోంది.


దొంగాట చిత్రం షూటింగ్ దృశ్యం


తాజాగా మంచు లక్ష్మి నిర్మాణ సారధ్యంలో ‘దొంగాట’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అందులో ఆమె మెయిన్ రోల్ కావడం మరో విశేషం. ఈ చిత్రంలో ఆడవి శేష్, లక్ష్మీప్రసన్న లీడ్ రోల్ చేస్తున్నారు. వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి సత్యవీర్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ ని చిత్రీకరించాలనుకుంటున్నారట. ఆ పాటను లక్ష్మీప్రసన్నపాడితే బాగుంటుందని సంగీత దర్శకుడు సత్యవీర్ భావించారట. అనుకున్నదే తడవుగా తన ప్రపోజల్ మంచు లక్ష్మి ముందు ఉంచాడు. ఎప్పటి నుంచో పాట పాడాలనే ఆమె ఆశ కూడా నెరవేర బోతున్నందుకు సంతోషించి ఈ పాటను రికార్డ్ చేసారట. ప్రొపెషనల్ సింగర్ లా లక్ష్మీప్రసన్న ఈ పాట పాడిందట. త్వరలోనే ఈ ప్రమోషనల్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: