స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘s/o స‌త్య‌మూర్తి మూవీకి సంబంధించిన ఓ విషయం తాజాగా  టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 9న ధియోట‌ర్స్ ని హిట్ చేయటానికి సిద్ధంగా ఉంది.

అయితే s/oస‌త్య‌మూర్తి మూవీలో వినిపిస్తున్న తాజాగా సమాచారం ప్రకారం, ఈ మూవీలో చిరంజీవి హిట్ సాంగ్ లో ఒక సాంగ్ ని ఇందులో పెట్టినట్టు తెలుస్తుంది. 1 నిముషం పాటు ఉండే ఈ సాంగ్ లో అల్లుఅర్జున్ తన డ్యాన్స్ తో షేక్ చేశాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన విషయం చిత్ర రిలీజ్ వరకూ ఎవ్వరికీ తెలియకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.

కాని మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో, చిరంజీవి పాట ఉందంటూ ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్ర‌సాద్, ఈ మూవీ ఆడియోని సూప‌ర్‌హిట్ చేసింది. ఈ మూవీకి ఎటువంటి క‌ట్స్ లేకుండా U/A సెన్సార్ స‌ర్టిఫికేట్ రావ‌టం విశేషం.

అల్లు అర్జున్, సమంత,నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం,రావ్ రమేష్ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: