తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు కౌబాయ్ అంటే ఇలా ఉంటారా అని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ వెండి తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారు. గూఢాచారి సినిమాలు, డిటెక్టీవ్ సినిమాలు ఎన్నో తీశారు. మోసగాళ్లకు మోసగాడు సినిమా తెలుగు చలన చిత్రంలో రంగంలో ఒక మైలు రాయి. సూపర్ స్టార్ కృష్ణ తొలి సినిమా ‘తెనె మనసులు’ ఈ సినిమా ఇప్పటికి 50 ఏళ్లు పూర్తయింది. ఈ 50 ఏళ్ల కెరియర్ లో ఆయన ఎన్నో అనుభవాలు చవిచూశారు. తన నటనా జీవితం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నో విషయాలు చెప్పారు.


తన పిల్లలతో సూపర్ స్టార్ కృష్ణ


ఇప్పటి వరకు నేను అనుకున్నవి అన్నీ సాధించాను కానీ నాకు ప్రస్తుతం రెండు కోరికలు ఉన్నాయి అవి నామనవడు గౌతమ్ తో ఒక సీనిమా తీయాలని రెండోది చత్రపతి శివాజీగా నటించాలని మరి ఈ రెండు కోరికలు తీర్చుకునే పనిలో ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరో చేయని అంటే కృష్ణ తొళినాళ్లలో రోజూ మూడు షిప్టులుగా పనిచేసేవారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, 2 నుంచి సాయంత్రం 9 వరకు, 10 నుంచి అర్ధరాత్రి 2 వరకు షూటింగ్ చేసావారట.


కృష్ణ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అల్లూరి సీతారామ రాజు లోని దృశ్యం


షూటింగ్ ముగించుకొని నిద్రపోయి మళ్లీ తెల్లవారు జామున 7 గంటలకే లేచేవాడట. ఆయన కేవలం నటన మీదే ద్యాస ఉంచకుండా దర్శకత్వం, నిర్మాణం, ఎడిటింగ్,పంపిణీ, ఎగ్జిబిషన్, స్టూడియో నిర్వహణలో నిత్యం పని చేస్తూనే ఉండేవారట. కాని ఇప్పటి కుర్ర హీరోలకు ఇన్ని పనుల్లో నిమగ్నం కావాలంటే అసాధ్యం అంటున్నారు. నా నటనా వారసత్వాన్ని నా కుమారుడు మహేష్ బాబు నిలబెట్టాడు. మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఒక తండ్రిగా నాకు ఇంతకంటే ఏం కావాలి అంటూ గర్వంగా చెబుతున్నారు. ఇప్పటికీ తనను నటించమని ఎందరో నిర్మాతలు, దర్శకులు వస్తుంటారు కానీ చిన్న పాత్రలు నటించడం తనకు ఇష్టం లేదని పెద్ద సినిమాల్లో మంచి పాత్ర వస్తే తప్పకుండా నటిస్తానని సూపర్ స్టార్ కృష్ణ తెలిపారు. అంత డెడికేషన్ ఉన్న వ్యక్తి కాబట్టే సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ.


మరింత సమాచారం తెలుసుకోండి: