తెలుగు చిత్రాల్లో చిరంజీవి ‘ఘరానా మోగుడు ’ ఎంతటి సూపర్ డూపర్ హిట్ అయ్యిందో తెలుసుగా ఈ సినిమాలో చిరంజీవి బాసు కొంచె ఫేస్ టర్నింగ్ ఇస్తారా అన్న డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో  గ్లామరస్ హీరోయిన్ నగ్మ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఆ కాలంలోనే తెలుగు చిత్ర సీమను తన గ్లామర్తో ఓ ఊపు ఊపింది. ఇక రాఘవేంద్ర రావు దర్శకత్వం అంటే వేరే చెప్పాలా పూలు, పండ్లు అందమైన లోకేషన్లు హీరోయిన్ బొడ్డు.   ఆ సినిమా చేసే నాటికి నగ్మ పెద్ద స్టార్ హీరోయిన్ కూడా కాదు. దాదాపు మూడు బాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే నటించింది.  


ఘరానా మోగుడు సినిమాలో వాణి విశ్వనాధ్ తో చిరంజీవి 


 బాలీవుడ్ సినిమాల్లో నగ్మను గ్లామర్ చూసి ముగ్దుడైన రాఘేవేంద్రరావు ‘ఘరానా మొగుడు' చిత్రానికి తీసుకున్నారు. చిరంజీవి-నగ్మలపై ఈ సినిమాలో ముద్దు సీన్లు కూడా ప్లాన్ చేసారు. అప్పటికే ముద్దు సీన్లు చేసి ఆరితేరిన నగ్న బాగానే నటించినా మన మెగాస్టార్  చిరంజీవి మాత్రం ఆమె పెదాలను పర్ ఫెక్టుగా  ముద్దు పెట్టలేక చాలా ఇబ్బంది పడి టేక్ లు తీసుకున్నాడట.  ఆ సీన్ సరిగా రాక పోవడంతో ఫైనల్ వెర్షన్ ఎడిటింగులో ఆ ముద్దు సీన్ కట్ చేసారట. ఈ విషయాలన్నీ రాఘవేంద్రరావు సౌందర్య లహరి కార్యక్రమంలో బయట పడ్డాయి.ఈ విషయం గురించి నగ్మ మాట్లాడుతూ...‘అపుడు లిప్ లాక్ సీన్ చేయడంలో చిరంజీవిగారు చాలా ఇబ్బంది పడ్డారు. సరిగా చేయలేక పోయారు. ఆ సీన్ చాలా బ్యాడ్ గా వచ్చింది. ఆ సీన్ ఉంటే ఆయన ఇమేజ్ డ్యామేజీ అవుతుందని కట్ చేసారు' అంటూ నగ్మ చెప్పుకొచ్చంది .


మరింత సమాచారం తెలుసుకోండి: