ఇదేంటి కమల్ హాసన్ ఎక్కడ.. బన్నీ ఎక్కడా అని ఆలోచిస్తున్నారు. అవునండీ ఏప్రీలో ఈ ఇద్దరు హీరోలు ఢీ అంటే ఢీ అనే పరిస్థతికి వచ్చింది. ఇండస్ట్రీలో ఎవరి ఇమేజ్ వారికే ఉంది. కానీ ప్రస్తుతం సినిమా మార్కెట్‌, ప్ర‌స్తుతం ఉన్న స‌మీక‌ర‌ణలు ఆలోచిస్తే స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాకి ఎవ్వ‌రైనా భ‌య‌ప‌డాల్సిందే. ఎందుకంటే సన్నాఫ్ సత్యమూర్తి థియేటర్లో ప్రదర్శించక ముందు ఎక్కువ పాపులర్ అయ్యింది.   త్రివిక్ర‌మ్ – అల్లు అర్జున్‌ల కాంబినేష‌న్‌లో జులాయి త‌ర‌వాత వ‌స్తున్న‌చిత్ర‌మిది. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఊపిందో అందరికీ తెలుసు.  ఇంత‌కు ముందే.. టాలీవుడ్‌కి త్రివిక్ర‌మ్ రూ.100 కోట్ల సినిమా అందించారు. అందుకే స‌త్య‌మూర్తిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఉత్తమ విలన్ చిత్రంలో కమల్ హాసన్ 


ఈ సినిమాపై పోటీకి దిగ‌డానికి క‌మ‌ల్ లాంటివాడే భ‌య‌ప‌డ్డాడు. క‌మ‌ల్ న‌టించిన తాజా చిత్రం `ఉత్త‌మ విల‌న్‌`. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నప్పటికీ కమల్ కాస్త ఆలోచనలో పడ్డాడు.  దీంతొ ఇప్పుడు ఉత్త‌మ విల‌న్‌ని వాయిదా వేశారు. దానికి కార‌ణం.. స‌త్య‌మూర్తి విడుద‌ల 9న అని డిక్లేర్ చేయ‌డ‌మే. ఉత్త‌మ విల‌న్ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓకేసారి విడుద‌ల చేయాల‌న్న‌ది క‌మ‌ల్ ప్లాన్‌.  10న అయితే త‌మిళంలో క‌మ‌ల్‌కి పోటీ లేదు. ఎంతైనా తెలుగులో మెగా ఫ్యామిలీకి కాస్త పాపులారిటీ ఎక్కువే  అందుకే తెలుగులో కావ‌ల్సిన స్థాయిలో థియేట‌ర్లు దొర‌క‌వు. అందుకే.. త‌న సినిమాని వాయిదా వేసుకొన్నాడు క‌మ‌ల్‌. ఉత్త‌మ విల‌న్ విడుద‌ల తేదీ ఎప్పుడో త‌ర‌వాత ప్ర‌క‌టిస్తార‌ట‌.  అదండీ సంగతి మొత్తానికి కమల్ కి బన్నీ ఇలా ఝలక్ ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: