2015 కు గాను తెలుగు ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ సినిమాగా టెంపర్ రికార్డు సృష్టించింది. పూరీ జగన్నాథ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి నుంచి మంచి ఓపెనింగ్స్ తో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫిబ్రవరి 13 న విడుదల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ ఏప్రిల్ 3 న 50 రోజులు పూర్తి చేస్తుంది.   టెంపర్ మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో ఉన్నాయి.


టెంపర్ చిత్రంలో కాజల్, ఎన్టీఆర్ 


జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీసు వద్ద రూ 67 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం రూ 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రూ 42 కోట్ల విడుదలకు ముందు వ్యాపారం జరిగింది. అయితే ఎన్టీఆర్ సినిమాల్లో రూ.40కోట్ల జాబితాలో ఇది రెండవ సినిమా.  గతంలో బాద్షా సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక మొత్తాలను వసూలు చెయ్యటంతో.

 ఈ సినిమాకు అన్ని భలే కలిసి వచ్చాయి. ఎన్టీఆర్ న్యూ లుక్స్, సిక్స్ ప్యాక్,  నెగిటీవ్ షేడ్  తో నటించడం. అందాల ముద్దు గుమ్మ కాజల్ ఈ సినిమాలో మరింత గ్లామర్ గా కనిపించింది.  ఈ సినిమా బండ్ల గణేష్ నిర్మాణ సారధ్యం వహించాడు.

ట్రేడ్ లో చెప్పుకునే లెక్కలు ప్రకారం క్లోజింగ్ డే నాటికి వచ్చిన కలెక్షన్స్...

ఏ ప్రాంతాల్లో ఎంతెంత ఏరియా కలెక్షన్స్

నైజాం - రూ 11.70 కోట్లు సీడెడ్ - 6.45 కోట్లు

ఉత్తరాంధ్ర- 3.50 కోట్లు గుంటూరు- 3.13 కోట్లు

కృష్ణా - 2.07 కోట్లు తూర్పు గోదావరి- 2.22 కోట్లు

పశ్చిమ గోదావరి- 1.75 కోట్లు నెల్లూరు- 1.30 కోట్లు

మొత్తం (ఆంధ్రా మరియు తెలంగాణా) 32.12 కోట్లు

బెంగుళూరు,మిగిలిన కర్ణాటక - 5.25 కోట్లు

తమిళనాడుతో సహా...దేశంలో మిగతా ప్రాంతాలు - 1.45 కోట్లు ఓవర్ సీస్ 5.65 కోట్లు మొత్తం (ప్రపంచవ్యాప్తంగా) 44.47 కోట్లు

గమనిక: ఇవన్నీ కేవలం ట్రేడ్ లో చెప్పుకోబడుతున్న లెక్కలు మాత్రమే. అధికారిక లెక్కలు కావు 

మరింత సమాచారం తెలుసుకోండి: