ఫ్యాషన్ షోలు చూసేవారికి ఎంజాయ్ మెంట్ బాగానే ఉంటుంది కానీ.. ఆ షోలో పాల్గొనే వారికే ఉంటుంది టెన్షనంతా.. వందల మంది తమనే చూస్తున్నారన్న టెన్షన్ ఒకవైపు.. పోటీదారుల కన్నా బాగా కనిపించాలన్న తాపత్రయం మరోవైపు.. వారిని క్షణం కూడా కుదురుగా నిలబడనీయవు. 

పైకి నవ్వుతూ..తుళ్లుతూ కనిపిస్తున్నా.. లోలోపల గుబులు మాత్రం అలాగే ఉంటుంది. ఇందుకు వెండితెరపై కాకలు తీరిన నటీమణులూ మినహాయింపేమీ కాదు.. ఇటీవల సన్న నడుము చిన్నది ఇలియానాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 

ముంబై లాక్మే ఫ్యాషన్ వీక్ లో అందాల్ని ఆరబోసిన ఈ అందాల సుందరి.. ర్యాంప్ పై తళుక్కున మెరిసింది. పింక్ కలక్ జిగ్ జాగ్ లెహెంగాలో గోల్డ్ ఎంబ్రాయిండరీ చేసిన డ్రెస్సులో మతి పోగొట్టింది. బ్లూ, లైట్ పింక్ కలర్ దుపట్టాతో కేక పుట్టించింది. 

ఐతే.. ఫ్యాషన్ ర్యాంప్ పై హొయలొలికిస్తున్న సమయంలో.. అనుకోకుండా దుపట్టాతో పాటు జాకెట్ కూడా భుజం కిందకు జారిపోయింది. షోల్డర్ జారిపోయినా పట్టించుకోలేదు. ఆలస్యంగా ఈ సంగతి గుర్తించిన ఇలియానా.. నడకలోనే అలవోకగా జాకెట్ సరి చేసుకుని సింపుల్ గా కవర్ చేసింది. మరి ఆ మాత్రం జాణతనం చూపకపోతే.. ఆమె ఇలియానా ఎలా అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: