టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ లలో ఒకరు నవదీప్. కాని నవదీప్ కి తెలుగులో తక్కువుగా అవకాశాలు వస్తున్నాయి. వచ్చిన అతి కొద్ది అవకాశాలు సైతం బాక్సాపీస్ వద్ద మురిపించలేకపోవడంతో, చేసేది లేక మరో ఆఫర్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది.

కేవలం ఒక వర్గం ప్రేక్షకులనే కాకుండా, అన్ని జోనర్స్ కి సంబంధించిన యాక్టింగ్ నవదీప్ చేయగలడు. ఇదిలా ఉంటే నవదీప్ సరైన సక్సెస్ చూసి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుండి నవదీప్ కి సక్సెస్ అనేది లేకపోవడంతో తను టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని భావించినట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

కాని, ప్రమోగాలకు మొదటి వరుసలో ఉండే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నవదీప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ విధంగానే తను ఓ క్రేజీ ఫిల్మ్ లో ఆఫర్ ని అందుకున్నట్టు క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. నాన్న ఫేం ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ‘ఇదు ఎన్నా మాయం’ అనే చిత్రంలో నటించనున్నాడు.

తమిళంలో‘అరింతుమ్ అరియమాలమ్’, ‘నెన్జిల్ జిల్ జిల్‘, ఏగన్’ సినిమాల ద్వారా సుపరిచితుడే. నవదీప్ తాజా చిత్రం భమ్ భొలెనాధ్ యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం అతను నటిస్తున్న నటుడు, అంతసీన్ లేదు సినిమాలు నిర్మాణదశలో వున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: