పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు విషయాలు గుర్తుకువస్తుంటాయి. వాటిల్లో ఒకటి సినిమా స్టార్ అయితే, మరొకటి పొలిటికల్ లీడర్. సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు చాలానే ఉన్నారు.

అలాగే పవన్ కళ్యాణ్ సైతం సినిమా రంగం నుండి వచ్చిన మరొక రాజకీయనాయకుడు. జనాలు మాత్రం పవన్ కళ్యాణ్ పై క్లారిటిగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ మాత్రం క్లారిటితో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఎదైన రాజకీయ పరంగా తీవ్ర సమస్య వచ్చినప్పుడు, జనాల్లోకి వచ్చి పవన్ పలకరించే పలరింపులు తప్పితే, మిగతా సమయంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి రాజకీయ అడుగులు వేయలేకపోతున్నాడు.

ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ డైలమాలో ఉన్నాడని రాజకీయవర్గాలు అంటున్నప్పటికీ, అసలు పవన్ కళ్యాణ్ ప్లానింగ్స్ ఏంటో అర్ధం కాక, అదే విధంగా ఇతర రాజకీయ నాయకులు సైతం తెగ ఆలోచిస్తున్నారు. మొత్తంగా పవన్ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చక్కటి మైండ్ గేమ్ ఆడుతున్నాడని అంటున్నారు.

తను కామ్ గా ఉంటూ, ఓ శక్తిగా దూసుకువస్తాడేమో అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఇక పవన్ అభిమానులు అయితే పవన్ కల్యాణ్ తన అప్ కమింగ్ మూవీ గబ్బర్ సింగ్2 మూవీ తరువాత పూర్తిగా రాజకీయాల్లోకి వస్తాడని భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: