పూరీ జగన్నాథ్ అంటే టాలీవుడ్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. తను ఏ సినిమా తీసినా అందులో చాలా ఫ్యాషన్ గా నేటివిటి కి తగ్గట్టుగా ఉంటుంది అదే సమయంలో మాస్ కు దగ్గరగా ఉంటుంది. అందుకే ఆయన టైటిల్స్ కూడా ఎంతో క్రేజ్ వచ్చింది. పూరీ కెరియర్ బిగినింగ్ లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘అమ్మ, నాన్న, తమిళమ్మాయి’ లాంటి సాఫ్ట్ టైటిల్స్ తో సినిమాలు చాలా సాంప్రదాయంగా ఉన్నట్టు అనిపించేవి. తర్వాత హీరో ఓరియెంటెడ్ సినిమాలు తీయడం మొదలు పెట్టాక టెటిల్స్ కూడా వెరైటీగా పెట్టడం మొదలు పెట్టాడు. ‘ఇడియట్’, ‘పోకిరి’, ‘దేశముదురు’, ‘నేనింతే’, ‘ఏక్ నిరంజన్’, ‘హార్ట్ ఎటాక్’, ‘టెంపర్’ లాంటి నెగటివ్ టైటిల్స్ తో సినిమాలు చేసాడు పూరి.  ఈ సినిమాలు  హీరో ఓరియెంట్ కావడం అందులోనూ హీరో మొదట్లో నెగిటీవ్ షేడ్స్ ఎక్కువగా ఉండటం చేత ఆ సినిమాలు కూడా డిఫరెంట్ మోడ్ లో ఉండేవి. హీరో పవర్ ఫుల్ పాత్రతో కనిపించేవాడు.


పూరీ జగన్నాథ్ ఫ్యామిలీ ఫోటో


అందుకే అవి మాస్ ఆధరణకు నోచుకున్నాయి. పూరీ ఒక్కసారి కమిటైతే తన మాట తనే వినడు అన్నట్టు ఒక్కసారి టైటిల్ ఫిక్సయితే ఎవ్వరు మార్చమన్నా మార్చడు. అందుకే ఇప్పటి వరకు సినిమాల హిట్ టాకే వచ్చాయి. మరి అలాంటి పూరీ జగన్నాథ్ ఇప్పుడు కాస్త మనసు మార్చుకున్నారనిపిస్తుంది. తన అప్ కమింగ్ మూవి జ్యోతి లక్ష్మి సినిమా అయిపోయాక నితిన్ తో తీసే సినిమా టైటిల్ విషయంలో యూటర్న్ తీసుకుంటున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైటిల్ ‘ మా అమ్మ.. సీతామహాలక్ష్మి’ టైటిల్ పరిశీలిస్తున్నాడట. అంటే ఈ సినిమాలో కాస్త సెంటిమెంట్ పాలు ఎక్కువే ఉన్నట్టుంది. అందుకే పూరి, స్టైల్ మార్చి సాఫ్ట్ టైటిల్, వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఆడియన్స్ ఏ మేరకు ఇంప్రెస్ అవుతారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: