దగ్గుబాటి రానా నటించిన కొత్త సినిమా కృష్ణం వందే జగద్గురం. ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 1000కు పైగా ధియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో రానా కెరీర్ లోనే భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల అవుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. క్రిష్ దర్శకత్వం వహించడంతో ఈ కృష్ణం వందే జగద్గురం సినిమాపై అందరి దృష్టి పడుతుంది. గతంలో అతను రూపొందించిన గమ్యం, వేదం సినిమాలు అతనికి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అలాగే మణిశర్మ సంగీతం, నయనతార అందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: