అవునుమరి, ఇప్పటికే కెరీర్ చివర్లో ఉంటే... ఏదైనా చేయడానికి ఎవరైనా సిద్ధపడతారు మరి. అపరిచితుడు లాంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన సదా... తరవాత అవకాశాలకోసం దర్శకులూ హీరోల వెంటపడింది. ఆమెను అప్పట్లో బాగా వాడుకున్న వాళ్లంతా ఇప్పుడు ఆమెమీద శీతకన్నేశారు. దాంతో... ఏం చేయాలో పాలుపోక ఆఖరి అస్త్రాన్ని తీసింది సదా. ప్పుడు నవదీప్ సరసన మైత్రి చిత్రంలో నటిస్తోంది సదా. ఈ సినిమా నవదీప్ కీ సదా కీ ఒకేలాంటిది. ఇద్దరికీ పరిశ్రమలో విలువ లేదు. అవకాశాలూ లేవు. దాంతో ఈ సినిమాలో తన ఆఖరి అస్త్రం అందాల ఆరబోతను వదిలింది సదా. ఈ సినిమా కథ ప్రకారం... పగలు బాగానే ఉండే మైత్రి... రాత్రి అవ్వగానే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుందట. పగలూ రాత్రీ కాదుగానీ... ఎప్పుడైనా అందాలను ఆరబోస్తానంటోంది సదా. అందుకు నిదర్శనమా అన్నట్టు రోజుకో భంగిమలో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. అదేదో సామెత చెప్పినట్టు... వీటికే కుర్రాళ్లు పడిపోతే, నీలి చిత్రాలే డైరెక్టుగా విడుదలయ్యేవి. ఆ రోజులు పోయాయని ఈ ముదురుపాపకు తెలిసేదెప్పుడో. 

మరింత సమాచారం తెలుసుకోండి: