హీరోయిన్స్ గ్లామర్ ఎక్స్ పోజ్ చేస్తూ వారిని రకరకాల రొమాంటిక్ యాంగిల్స్ లో చూపెడుతూ యూత్ ని రెచ్చకొట్టి  మళ్ళీ మళ్ళీ చూసేడట్లుగా అందమైన  హీరోయిన్స్ శరీరాల పై రకరకాల పూలు పండ్లతో ప్రయోగాలు చేసే కల్చర్ కు శ్రీకారం చుట్టింది దర్శకుడు రాఘవేంద్రరావు.

ఆరోజులలో శ్రీదేవితో వానపాటలో చిందేస్తున్న ఎన్టీఆర్


ఆ తరువాత సీనియర్ ఎన్టీఆర్ ఆరోజులలో మరొక అడుగు ముందుకు వేసి వాన పాటలలో శ్రీదేవి జయప్రదలతో స్టెప్స్ వేస్తూ వారి అందమైన నడుము దగ్గర టచ్ చేసే సాంప్రదాయాన్ని  ఆరోజుల్లోనే ప్రారంభించారు. రామారావు సినిమాలు వదిలి రాజకీయాలలోకి వెళ్ళిపోయిన తరువాత ఈ సంప్రదాయాన్ని మెగా స్టార్ చిరంజీవి తనతో నటించిన ఆనాటి గ్లామర్ బ్యూటీలు రాధ విజయశాంతి లతో హిప్ టచ్ ని కొనసాగించాడు. 

తమన్న అందాలతో ఆడుకుంటున్న రాంచరణ్


మళ్ళీ ఆ తరువాత చిరంజీవి కూడా రాజకీయాల బాట పట్టడంతో అతడి వారసుడిగా వచ్చిన రామ్ చరణ్ తో పాటు మిగతా మెగా హీరోలు కూడా ఈ హిప్ టచ్ ని కొనసాగిస్తూ యూత్ ని మెప్పిస్తూ సూపర్ హిట్లను అందుకుంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి వారసుడిగా సినిమాలలోకి వచ్చిన రామ్ చరణ్ తాను నటించిన ‘రచ్చ’ లో తమన్నాతో ‘నాయక్’ లో కాజల్ తో ఈ హిప్ టచ్ సీన్స్ లో నటించి హిట్స్ కొట్టేసాడు. 

సమంతతో సయ్యటాడుతున్న పవన్ కళ్యాన్


ఆ విధంగా ఈవిషయంలో తాను కూడ ఏమి తక్కువ కాదు అంటూ  పవన్ కళ్యాణ్ కూడా ఈ హిప్ టచ్  సీన్స్ లో సమంత తో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించి మెప్పించాడు. ఇక అలాగే అల్లుఅర్జున్ కూడా లేటెస్ట్ గా నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ పార్టీ సాంగ్ లో హీరోయిన్స్ హిప్స్ ను టచ్ చేస్తూ తమ మెగా కుటుంబానికి ఈ హిప్ కల్చర్ బాగా కలసి వస్తోందని మరొకసారి రుజువు చేసాడు. ఈ  హిప్ టచ్ సెంటిమెంట్ ఎలా ఉన్నా మెగా హీరోల ఈ హిప్ టచ్ సెంటిమెంట్ తో నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి అన్నది వాస్తవం..


మరింత సమాచారం తెలుసుకోండి: